పవన్ సినిమాలో పాట కోసం అన్ని కోట్లు అడిగిన శ్రీలీల..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

పవన్ కళ్యాణ్ ,సాయి ధరంతేజ్ ఇద్దరు కలిసి నటిస్తున్న చిత్రం వినోదయ సీతం. ఈ సినిమాని రీమిక్స్ చేస్తున్నారు. ఇందులో స్పెషల్ సాంగ్ లో శ్రీలీల నటించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి సందD చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ రవితేజ నటించిన ధమాకా చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. వరుస సినిమాలో చేస్తే బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ పవన్ సినిమాలో సాంగ్ అనే సరికి బాగానే అట్రాక్షన్ అయినట్లుగా తెలుస్తోంది.

Pawan Kalyan's Special Song With Sreeleela?

యూత్ ఆడియన్స్ అంతా కూడా ఈమెకి ఎక్కువ మక్కువ చూపుతున్నారని చిత్ర బృందం భావించి పవన్ సినిమాలో ఈమె కోసం ఒక ప్రత్యేకమైన పాట ఎంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కెరియర్ ప్రస్తుతం మంచి స్వింగ్ లో ఉన్న సమయంలో స్పెషల్ సాంగ్ చేయడం అనేది పెద్ద రిస్క్ అని చెప్పవచ్చు. కానీ అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ కాబట్టి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము. అందుచేతనే శ్రీ లీల తనకు నచ్చకపోయినా ఓకే చెప్పినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే అందుకు తగ్గట్టుగానే ఈ అమ్మడు ఈ పాట కోసం భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లుగా టాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా ఈ పాట కోసం నేను కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అడిగినట్లు సమాచారం. మరి శ్రీ లీల కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈమె అడిగినంత ఇచ్చి ఈ సినిమాలో నటించేలా చేస్తారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రం ధమాకా చిత్రాన్ని తరికెక్కించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తోనే వినోదయ సితం సినిమాని తెలుగులో రీమిక్స్ చేస్తున్నారు.

Share.