టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కొక్క హీరో ఒక్కొక్క రకంగా ఉంటారు. అలా మంచిగా ఉండే వారిలో వెంకటేష్ కూడ ఒకరు.వెంకటేష్ మొట్టమొదటిగా కలియుగ పాండవులతో కెరీస్ ని స్టార్ట్ చేశాడు. ఆ తరువాత ఎన్నో సినిమాలను తీశారు.ఆయన మీద కానీ తన కుటుంబం మీద కానీ ఎలాంటి రూమర్స్ ఇప్పటివరకు లేవు. నిజంగా ఆయన చూస్తే అలాగే అనిపిస్తుంది. ఇక వెంకటేష్ నిజ జీవితంలో ఆయన భార్య నీరజా గురించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వెంకటేష్ ,నీరజా వారి వివాహ బంధంలో చాలా అన్యోన్యంగా అద్భుతంగా ఉన్నారు. అయితే వెంకటేష్ గారి గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయన పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఆత్రుతగా ఉంటారు. ఆయన ఎక్కడ ఎప్పుడు తన పిల్లల గురించి కానీ తన భార్య గురించి కాని తన కుటుంబం గురించి కానీ మాట్లాడరు. నీరజ చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రాంతానికి చెందిన అమ్మాయి.
ఇక ఈమె తండ్రి పేరు వెంకటసుబ్బారెడ్డి. తల్లి పేరు ఉషారాణి నీరజ కుటుంబం పెద్ద జమిందారి కుటుంబం. ఈమె తండ్రి పెద్ద భూస్వామి అనేక వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఇక నీరజ ఎంబీఏ పూర్తి చేశారు . చదువు అంతా పూర్తి అయిన తర్వాత ఒకానొక సమయంలో రామానాయుడు వెంకటేష్ కు పెళ్లి చేయాలని ఎవరైనా అమ్మాయి ఉంటే చూడాలని విజయ నాగిరెడ్డికి చెప్పగా నాగిరెడ్డి గారు సుబ్బారెడ్డి గారి గురించి చెప్పటంతో రామానాయుడు మదనపల్లి వెళ్లి ముందుగా నీరజాను చూసి వచ్చారు. తరువాత పెళ్లిచూపులు ఏర్పాటు చేసి ఒకరికొకరు నచ్చడంతో 1989లో వెంకటేష్ నీరజ పెళ్లి జరిగింది.