మంచు మనోజ్ -మౌనిక రెడ్డి పెళ్లి డేట్ లాక్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

మంచు కుటుంబం నుంచి మంచు మనోజ్ హీరోగా ఎంట్రీ చేసి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలవుతోంది. గడచిన కొంతకాలం నుంచి మంచు మనోజ్ ఏదో ఒక వార్తలలో నిలుస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మంచు మనోజ్ ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన నుంచి సినిమా విడుదలై చాలా కాలం అవుతోంది .కానీ వ్యక్తిగత విషయాలతో మాత్రం ఎప్పుడు వార్తల్లోని నిలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా రెండో వివాహానికి సంబంధించి ఏదో ఒక వార్త వైరల్ గా మారుతూనే ఉంది.

Manchu Manoj: మంచు మ‌నోజ్ మ్యారేజ్ డేట్ ఫిక్స్‌.. వ‌చ్చే వారంలో ఎప్పుడంటే!  - manchu manoj and bhuma naga mounika reddy marriage date fixed - Samayam  Telugu

గతంలో వివాహమై విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న మనోజ్ గత కొంతకాలంగా భూమా మౌనిక రెడ్డి తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక మౌనిక రెడ్డికి కూడా గతంలో వివాహమై ఒక కొడుకు కూడా పుట్టిన తర్వాత విడాకులు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆ కొడుకు కూడా మౌనికతోనే ఉన్నట్లు సమాచారం. ప్రముఖ రాజకీయవేత్త దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనిక రెడ్డి.

ఈ క్రమంలోనే మంచు మనోజ్ ,మౌనిక రెడ్డి వివాహం వచ్చే నెల 3వ తేదీన వీరి పెళ్లి చాలా గ్రాండ్గా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .ఈ పెళ్లికి సంబంధించిన ఫంక్షన్ కూడా మనోజ్ సోదరి మంచు లక్ష్మి ఇంట్లో జరగబోతున్నట్లు సమాచారం. అయితే ఈ వివాహాన్ని ఎక్కడ చేస్తారు ఎవరెవరు వస్తారు అనే విషయం మాత్రం ఇంకా బయటికి రాలేదు.ఈ వివాహానికి మంచు ఫ్యామిలీకి ,అటు భూమా ఫ్యామిలీకి ఇష్టం లేదని వార్తలు చాలా వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ పెళ్లి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Share.