టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీకి ఒక మంచి క్రేజ్ ఉంది. ఇక దివంగత నటుడు నందమూరి తారక రామారావు గారి కొడుకులలో ఒకరైన మోహన్ కృష్ణ గారి అబ్బాయి తారకరత్న. ఇతను సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వటానికి బాబాయి బాలయ్య కారణం. తారకరత్న ఎంట్రీ ఎంతో వైభవంగా స్టార్ట్ అయ్యింది. ఒకే రోజు 9 సినిమాలను అనౌన్స్మెంట్ చేసి పూజా కార్యక్రమాలను స్టార్ట్ చేసి చరిత్ర సృష్టించాడు తారకరత్న. ఇప్పటికి కూడా ఈ రికార్డు అలానే ఉంది.
ఇక తారకరత్న హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఒకటో నెంబర్ కుర్రాడు కానీ మొదలుపెట్టిన సినిమా మాత్రం యువరత్న నందమూరి రామకృష్ణ నిర్మించారు. ఇది వారి సొంత బ్యానర్ లో చేసిన మూవీ అయితే ఈ సినిమా కొన్ని కారణాలవల్ల ఆలస్యం అయ్యింది. అందుకనే ఈ చిత్రం కంటే ముందే ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా రిలీజ్ అయింది. ఇక ఈ చిత్రం అప్పట్లోనే ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించింది తారకరత్నకి. ఇక ఆ తరువాత యువరత్న సినిమాని రిలీజ్ చేశారు. అది అనుకున్నంత విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది.
ఆ తరువాత తారకరత్న చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూనే వచ్చాయి. భద్రాద్రి రాముడు సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ దానికి చాలా సమస్యలు ఎదుర్కొన్నారట. మొదట తారకరత్న అనౌన్స్ చేసిన సినిమాలలో కొన్ని సినిమాలు సగం షూటింగ్ అయ్యి ఆగిపోయాయట. మరికొన్ని సినిమాలు ఆర్థిక లావాదేవీల కారణంగా సెట్ లోకి అడుగుపెట్టలేదు.. ఇలా కొంతమంది నిర్మాతలు తారకరత్నతో చేసిన సినిమాలకు పారతోషకాలు ఎగ్గొట్టారని సమాచారం.ఆ సినిమాలకు తారకరత్న అడ్వాన్సులతోనే సరిపెట్టారట చాలామంది అలా ఆయన్ని డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి ఇండస్ట్రీలో ఎదగనివ్వకుండా చేశారు. ఒకవేళ అన్ని సినిమాలు చేసి ఉంటే తారకరత్న మరో రేంజ్ లో ఉండేవాడు.