కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన శ్రీరెడ్డి తెలుగు సినీ జనాలకు ఒకానొక సమయంలో కంటిమీద కునుకు లేకుండా చేసింది . గత కొన్నాళ్లుగా తమిళనాడులో ఉంటున్న ఈమె అక్కడే తన ఆపరేషన్స్ ను తెలుగు రాష్ట్రాలలో కొనసాగిస్తూ సోషల్ మీడియా ద్వారా దాడి చేస్తోంది.. చెన్నై వెళ్లిపోయిన తర్వాత కూడా శ్రీరెడ్డి చాలాసార్లు తెలుగు హీరోల మీద రకరకాలుగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆమెను చాలామంది సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. చాలామంది ఆమెను అభిమానిస్తున్నారు.. అందుకు కారణం ఆమె సినిమా హీరోలను ,రాజకీయ పార్టీ నాయకులను తీవ్రంగా విమర్శిస్తూ ఉండడమే.
అలా పవన్ యాంటీ ఫ్యాన్స్ తో పాటు మరికొంతమంది హీరోల యాంటీ ఫ్యాన్స్ కూడా ఆమెకు మద్దతు పలుకుతున్నారు. ఇప్పుడు వారంతా కూడా శ్రీ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే శ్రీరెడ్డి ఇప్పుడు చాలా సైలెంట్ గా ఉండడం చూసి వారు తట్టుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లు మౌనంగా ఎందుకు ఉంటుంది అంటూ రకరకాలుగా విమర్శిస్తున్నారు. ఇదిగో అదిగో శ్రీరెడ్డి తన సైలెన్స్ కు బ్రేక్ ఇస్తుంది అంటూ చాలామంది చెప్పారు. కానీ ఆమె మాత్రం తన నోటికి తాళం వేసుకుంది అన్నట్లుగా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి . మొత్తంగా శ్రీ రెడ్డి సైలెంట్ కు కారణం ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇకపోతే శ్రీరెడ్డి మునుముందు తన నోరు విప్పి గతంలో మాదిరిగా తన వ్యూ ను సోషల్ మీడియా ద్వారా అలాగే యూట్యూబ్ ద్వారా అందరికీ వినిపిస్తుంది అంటూ కూడా కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా శ్రీరెడ్డి సైలెన్స్ ను ఆమె అభిమానులు తట్టుకోలేక పోతున్నారని చెప్పవచ్చు.