తెలుగు ఇండస్ట్రీకి మొట్టమొదటగా సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అంచలంచలుగా ఎదిగిన హీరోయిన్ అనుష్క శెట్టి .ఇక తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ మరువలేని చిత్రాలలో అరుంధతి చిత్రం ఒకటి ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. 2009 జనవరి 16న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఇందులో సోను సూద్, సాయాజీ షిండే, కైకాల సత్యనారాయణ, తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమా మల్లెమాల ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మాతగా ఈ చిత్రానికి కోటి స్వరాలు అందించారు.
కోడి రామకృష్ణ తీసిన సినిమాలు ప్రేక్షకులకు త్రిల్ అయ్యేలా చేస్తూ ఉంటాయి. ఇక నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి కూడా డౌన్ లోనే ఉన్నారు. అలాంటి తరుణంలో అరుంధతి వారికి మంచి ఊరటని ఇచ్చిందనే చెప్పాలి. ఇక అరుంధతి సినిమాని ఏ హడావిడి లేకుండా సైలెంట్ గా ప్రారంభించారు. ఈ సినిమా విడుదలయ్యే వరకు కూడా అంతటి ఘనవిజయాన్ని సాధిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.
దాదాపు అరుంధతి సినిమా రూ .35 కోట్ల షేర్ ను వసూలు చేసింది. అప్పటి వరకు గ్లామర్ రోలకి పరిమితమైన అనుష్క శెట్టి ఈ చిత్రంతో అందుకోలేనంత రేంజ్ కు ఎదిగిపోయింది. అయితే అరుంధతి సినిమాకు ఫస్ట్ ఛాయిస్ అనుష్క కాదట .మలయాళ నటి మమతా మోహన్ దాస్ కు చెప్పారట. ఆమె కూడా ఆ ప్రాజెక్టుని ఓకే చేసి సైన్ చేసిందట. కానీ ఆమె మేనేజర్ మల్లెమాల ప్రొడక్షన్స్ మంచిది కాదని చెప్పటంతో అరుంధతి సినిమా నుంచి తప్పుకుందట .శ్యాం ప్రసాద్ రెడ్డి ఆమె కోసం దాదాపు మూడు నెలలు ప్రయత్నం చేశారట కానీ మమతా మోహన్దాస్ మాత్రం నో చెప్పిందట అప్పట్లో గ్లామర్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న అనుష్కను ఫైనల్ చేశారు. ఇలా తనకు దొరికిన అవకాశాన్ని మిస్ చేసుకుంది మమతా మోహన్ దాస్.