ఇన్ని రోజులు జబర్దస్త్ వేదికపై ప్రేమ పక్షుల్లా విహరించిన జబర్దస్త్ రాకింగ్ రాకేష్ , జోర్దార్ సుజాత ఈరోజు ఉదయం తిరుపతిలో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. మొన్నటివరకు తమ ప్రేమను ఆస్వాదించిన ఈ జంట ఇప్పుడు ఎవరికీ చెప్పకుండా రహస్యంగా వివాహం చేసుకోవడంతో పలు అనుమానాలకు కూడా దారితీస్తోంది. నిజానికి గత నెల ఎంగేజ్మెంట్ చేసుకొని.. ఎంగేజ్మెంట్ చేసుకున్న రోజే లగ్నపత్రిక కూడా రాసుకుంటాము అంటూ జోర్దార్ సుజాత తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. అంతే కాదు త్వరలోనే తమ పెళ్లి డేట్ ని కూడా ప్రకటిస్తామని ఆమె స్పష్టం చేసింది.
కానీ ఉన్నట్టుండి ఈరోజు ఇలా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది ఈ జంట. మొత్తానికైతే ఈరోజు ఉదయం పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నారు. ఇక వీరి పెళ్లికి జబర్దస్త్ నుంచి కమెడియన్ గెటప్ శ్రీను ఆయన భార్య అలాగే యాంకర్ రవి సకుటుంబ సమేతంగా హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు ఇకపోతే వీరి పెళ్లికి సంబంధించిన ఒకటి రెండు ఫోటోలు మాత్రమే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి ఇక పూర్తి వివరాలు బయటకు రావాలి అంటే వారే స్వయంగా స్పందించాల్సి ఉంటుంది
జబర్దస్త్ ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న రాకింగ్ రాకేష్ ఇటీవల కాలంలో వరుస కామెడీ స్కిట్లతో ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాడు. మరొకవైపు జోర్దార్ కార్యక్రమం ద్వారా న్యూస్ రిప్రెసెంటర్ గా మంచి పేరు సంపాదించుకున్న జోర్దార్ సుజాత కూడా బిగ్బాస్ ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది . మొన్నటి వరకు జబర్దస్త్ స్కిట్స్ లో అలరించిన ఈ జంట ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.
View this post on Instagram