ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంతోమంది సినీ సెలబ్రిటీల జాతకాలు రాజకీయ నేతలు జాతకాలు చెబుతూ మంచి పాపులారిటీ సంపాదించారు. ఎప్పుడు కూడ నిరంతరం ఏదో ఒక వార్తలలో నిలుస్తూ ఉంటాడు వేణు స్వామి. అయితే ఈయన చెప్పే విషయాలను కొంతమంది నమ్ముతారు మరి కొంతమంది కొట్టి పారేస్తూ ఉంటారు. అయితే వేణు స్వామి వ్యక్తిగత విషయాల గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు.. ముఖ్యంగా వేణు స్వామి భార్య సిని పరిశ్రమకు చెందిన వ్యక్తి అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
ఇండస్ట్రీలో వీణ ఆర్టిస్టుగా కొనసాగుతున్న వీణనే శ్రీవాణి.వేణు స్వామి వివాహం చేసుకున్నది. వీరిద్దరిది ప్రేమ వివాహం. ఈ షాకింగ్ విషయాన్ని శ్రీ వాణి స్వయంగా తెలియజేయడం జరిగింది. శ్రీవాణి ఎంత అందంగా ఉంటారో అంతే అందంగా వీణను వాయిస్తూ ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీవాణి తన లవ్ స్టోరీ గురించి బయట పెట్టడం జరిగింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన శ్రీవాణి పూర్తి సాంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి.
ఇంటర్ చదువుకునే రోజులో నుంచే పిల్లలకు వీణ క్లాసులు చెప్పేదట. అయితే ఇండియన్ రైల్వేలో జాబు రావడంతో ఆమె ట్రైనింగ్ కోసం హైదరాబాదుకు వచ్చిందట. అక్కడ కూడా వీణ క్లాసులు చెబుతూ ఉండగా వేణు స్వామి కజిన్ డాక్టర్ కూడా శ్రీవాణి క్లాసులకు వెళ్లేవారట. అలా ఒకరోజు ఆమెను తీసుకు వెళ్ళేందుకు వేణు స్వామి అక్కడికి వచ్చారట. అక్కడ శ్రీవాణిని చూసి మొదటి చూపులోనే ఆమె ప్రేమలో పడ్డారట వేణు స్వామి. ఇక అమ్మాయిని వివాహం చేసుకుంటానని చెప్పడంతో శ్రీవాణికి ప్రపోజ్ కూడా చేశారట. ఇక వేణు స్వామి మంచితనాన్ని తెలుసుకొని శ్రీవాణి కూడా వెంటనే ఆయనకు ఒకే చెప్పడంతో పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకున్నారు.