కుప్పంలో నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన తారకరత్న 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాల హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ చివరికి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ తుది శ్వాస విడిచారు. ఎప్పుడైతే గుండెపోటు వచ్చిందో అప్పటినుంచి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. శివరాత్రి పర్వదినాన ఆయన మరణంతో నందమూరి ఫ్యామిలీ మొత్తం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. తారకరత్న చనిపోయిన ఐదు రోజులు అవుతున్నప్పటికీ ఆయన భార్యా పిల్లల కన్నీటిని ఆపడం ఎవరి తరం కాలేదు. ఈ క్రమంలోనే తారకరత్నకు సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
తారకరత్న తండ్రి మోహనకృష్ణకు ఇద్దరు సంతానం.. అందులో కొడుకు తారకరత్న .. కూతురు రూప.. మోహన్ కృష్ణ కూడా ఇండస్ట్రీలో సినిమా ఆటోగ్రాఫర్ గా నిర్మాతగా కూడా వ్యవహరించారు. అలాంటి ఆయన తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తితో పాటు ఇండస్ట్రీలో కూడా చాలా ఆస్తి పోగు చేశారు. ఇకపోతే తారకరత్న ఇంట్లో వాళ్ళని ఎదిరించి అలేఖ్యరెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తారకరత్న తన కుటుంబానికి శాశ్వతంగా దూరం కావాల్సి వచ్చింది. దీంతో మోహనకృష్ణ కోపానికి గురై నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నా కొడుకు ఇవ్వను అంటూ చెప్పారట.
అంతేకాదు నా మొత్తం యావదస్తుని నా బిడ్డ రూపాకే ఇస్తానని తారకరత్నతో ఆయన అప్పట్లో చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త బయటకు రావడంతో.. తారకరత్న తండ్రి మోహన కృష్ణ మొత్తం తన కూతురు రూప పేరుమీద ఆస్తులు రాసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.