పిల్లలు పుట్టరని కన్న తల్లే అవమానించింది.. ఆమని ఎమోషనల్ కామెంట్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఆమని.. ఒకప్పుడు వరుస ఆఫర్లతో బిజీగా ఉండేది. కాలక్రమేనా కొత్త హీరోయిన్లు అడుగుపెడుతున్న నేపథ్యంలో వీరికి అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఈమె ఇప్పుడు కూడా పర్వాలేదు అనుకునే రేంజ్ లో అవకాశాలను అందుకుంటుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని ఎన్నో విషయాలను తెలుపుతూ ఎమోషనల్ అయింది.

నాకు సినిమా పిచ్చి ఎక్కువ.. మేము మా ఇంట్లో తెలుగు సినిమాలను ఎక్కువగా చూసేవాళ్ళము. నిజానికి నేను కన్నడ చదివాను . చిరంజీవి గారి కోసం మ్యాగజైన్స్ కూడా కొనుగోలు చేసేదాన్ని. మా బ్రదర్కు డబ్బులు ఇచ్చి చిరంజీవి ఫోటోలను తెప్పించుకునే దాన్ని ..చిరంజీవి అంటే అంత ఇష్టం అంటూ ఆమని తెలిపారు . మా ఆయన బంగారం సినిమాలో నాకు చాన్స్ వచ్చినట్టే వచ్చి పోయింది అంటూ తెలిపిన ఆమని సౌందర్య తన కు అత్యంత సన్నిహితురాలు అని వెల్లడించింది. వెంకటేష్ గారికి జోడిగా నటించే అవకాశం నాకు దక్కలేదు అని తెలిపిన ఆమని .. మ్యారేజ్ తర్వాత బ్రేక్ తీసుకోవడం వల్ల మంచి మంచి సినిమాలను కూడా కోల్పోవడం జరిగింది అంటూ వెల్లడించింది.

ఇకపోతే ఒక బాబు, ఒక పాప అని చెప్పిన ఆమని.. పిల్లలు ఆలస్యంగా పుట్టడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ ఆమె తెలిపింది. నా జీవితంలో అన్నీ ఆలస్యంగానే జరిగాయి. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. మా అమ్మ చాలాసార్లు మీకు పిల్లలు పుట్టరు అంటూ తెగ హేళన చేసేది. నీకు పిల్లలు రాసి పెట్టలేదని అమ్మ కామెంట్ చేయడంతో బాగా ఏడ్చేదాన్ని.. కానీ ఎవరు ఏం చెప్పినా.. బాధపడిన సరే దేవుడితో గొడవ పడే దానిని అంటూ ఆమని వెల్లడించారు. ఇప్పుడు ఆమని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Share.