యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ‘గీత గోవిందం’పై మొదట్నుండీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ మొదలుకొని చిత్ర టీజర్ వరకు ప్రేక్షకులను ఆకట్టుకోవడం, అర్జున్ రెడ్డి వంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమా తరువాత విజయ్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తి చూపించారు.
ఇక ఈ సినిమా రిలీజ్ కాగానే మంచి టాక్‌ను సొంతం చేసుకోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్ల పరంగా టాపు లేపుతుంది. అన్ని ఏరియాల్లో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం కేవలం 5 రోజులు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.32 కోట్లకుపైగా షేర్ వసూళ్లు సాధించింది. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చిత్ర రికార్డును గీత గోవిందం చాలా తేలిగ్గా అధిగమించేసింది. యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ కావడంతో ఈ సినిమా సరికొత్త సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తూ వెళుతుంది. మరి ఈ సినిమా టోటల్ రన్లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.
ఏరియాల వారీగా ఈ చిత్ర 5 రోజుల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
ఏరియా – 5 డేస్ కలెక్షన్స్
నైజాం – 8.40 కోట్లు
సీడెడ్ – 3.35 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.22 కోట్లు
గుంటూరు – 1.74 కోట్లు
ఈస్ట్ – 1.74 కోట్లు
వెస్ట్ – 1.40 కోట్లు
కృష్ణా – 1.66 కోట్లు
నెల్లూరు – 0.68 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 21.19 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 3.90 కోట్లు
ఓవర్సీస్ – 7.20 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – 32.29 కోట్లు