టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు జోడిగా.. ధీటుగా సినిమాలు చేసి తెలుగు , తమిళ్ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకున్న హీరోయిన్ భానుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్ గా కెరియర్ కి పులిస్టాప్ పెట్టిన ఈమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రను పోషిస్తూ ఇంకా సినిమాలలోనే కొనసాగుతోంది. ఇదిలా ఉండగా తాజాగా భానుప్రియ సోదరికి సంబంధించిన కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
భానుప్రియ చెల్లెలు ఎవరో కాదు శాంతి ప్రియ.. కొన్ని సినిమాలలో హీరోయిన్గా నటించింది. కానీ స్టార్ స్టేటస్ ను పొందలేకపోయింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడిన ఈమె మహర్షి, జస్టిస్ రుద్రమదేవి వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే హీరోయిన్ గా సినిమాలకు గుడ్ బై చెప్పిన తర్వాత శాంతి ప్రియ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ను ప్రారంభించింది. అంతేకాకుండా రీసెంట్ గా బాలీవుడ్ లో ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించింది. సునీల్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈమె వెబ్ సిరీస్ లో శాంతి ప్రియ ముఖ్యమైన పాత్రలో నటించింది.
ఇకపోతే భానుప్రియ లాగే శాంతి ప్రియా జీవితంలో కూడా ఎన్నో విషాదఛాయలు అలుముకున్నాయి. 1999లో శాంతి ప్రియ ఇండస్ట్రీకి చెందిన సిద్ధార్థ రెడ్డిని వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు కానీ 2004లో సిద్ధార్థ రెడ్డి మరణించడంతో శాంతి ప్రియ జీవితంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికి ఒంటరిగానే అనాధగా జీవిస్తోంది శాంతి ప్రియ.