టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో పేరుపొందారు మధుమిత, శివ బాలాజీ జంట. ఈ మధ్యకాలంలో కొంతమంది పెళ్లయిన ఏడాది రెండేళ్లకే విడాకులు తీసుకుంటున్న జంటలను మనం చూస్తూనే ఉన్నాం కానీ వీరికి పెళ్లయి 13 ఏళ్లు అవుతున్న వీరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ మనస్పర్ధలు రాకుండా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ జంట. వీరు తక్కువ సినిమాలనే చేశారు. కానీ చేసినవన్నీట్లోనూ గుర్తింపును సంపాదించుకున్నారు.
హీరో హీరోయిన్లుగా నటించి రియల్ లైఫ్ లో భార్య భర్తలుగా మారారు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పెళ్లి జరిగి చాలా ఏళ్లు అవుతున్నా కూడా ఈ జంట ఏ విషయంలో కూడా వార్తల్లో నిలవలేదు. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలో కూడా వీళ్ళ పేరు తక్కువగానే వినిపిస్తూ ఉంటుంది. వీరిద్దరి ప్రేమ గుర్తుగా వీరికిద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఇక శివబాలాజీ బిగ్ బాస్ విన్నర్ గా కూడా నిలిచి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఒకానొకప్పుడు శివ బాలాజీ ఎంతో బిజీగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే మొన్నటి వరకు సోషల్ మీడియాలో, సినిమాలలో పెద్దగా కనిపించని శివ బాలాజీ ఇటీవలే మొదలైన మిస్టర్ అండ్ మిసెస్ అనే రియాల్టీ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.శివ బాలాజీ సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా కనిపించాడు.
ఈ నేపథ్యంలోనే తనవి తన భార్య మధుమితకు సంబంధించిన ఫోటోలను వీడియోలను పంచుకుంటూ ఉంటాడు. తాజాగా శివబాలాజీ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశాడు. అందులో మధుమిత ఊ అంటావా మామ ఉ ఊ అంటావా అనే సాంగ్ స్టెప్పులు వేసింది. అది చూసిన నేటిజెన్లు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.<
View this post on Instagram
/p>