టాలీవుడ్ లో తారకరత్న మరణం తర్వాత తారకరత్నకు సంబంధించి వ్యక్తిగత విషయాలు పలు రకాలుగా వైరల్ గా మారుతున్నాయి. అయితే ఏ వార్తలు నమ్మాలో తెలియక అభిమానులు సతమతమవుతున్నారు. అయితే తారకరత్న స్నేహితుడు సురేష్ అనే వ్యక్తి కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల అవి ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. తారకరత్న ,అలేఖ్య రెడ్డి మొదటి నుంచి ప్రేమించుకున్నారని తెలియజేశారు. కామన్ ఫ్రెండు ద్వారానే వీరిద్దరి పరిచయం ఏర్పడిందని సురేష్ తెలియజేయడం జరిగింది. గత జీవితం ఒక పీడకల లాంటిదని తెలిపారు.
ముఖ్యంగా తారకరత్నను తన అత్తగారు మాత్రం ఒక కొడుకుల భావించేదని సురేష్ తెలిపారు. అలేఖ్య ఇంట్లో తారకరత్న అని ఒప్పుకున్నారు కానీ తారకరత్న ఇంట్లో ఆమెను ఒప్పుకోలేదని సురేష్ తెలిపారు. బాలయ్య గారు మాత్రమే వీరిద్దరిని యాక్సెప్ట్ చేశారని.. తారకరత్న ఫాదర్ యాక్సెప్ట్ చేయలేదని తెలిపారు. అలేఖ్యకు ఒక బ్రదర్ ఉన్నారట. విజయ్ సాయి రెడ్డి కూతురు ,అలేఖ్య మంచి స్నేహితులని కూడా తెలియజేశారు. బాబాయ్ అంటే తారకరత్నకు ప్రాణమని తెలిపారు.
ఇక పెద్దమ్మాయి అంటే తారకరత్నకు చాలా ఇష్టమని పెద్దమ్మాయిని యూఎస్ఏ లో చదివించాలనుకుంటున్నారని తెలిపారు ఫైనాన్షియల్ గా మరి అంత ఇబ్బంది పడే పరిస్థితుల్లో అయితే తారకరత్న లేరని తన స్నేహితుడు తెలిపారు. ముఖ్యంగా తారకరత్నకు ఎలాంటి అప్పులు లేవని హెల్త్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని తెలిపారు. కేవలం స్మోకింగ్ అలవాటు మాత్రమే ఉండేదని సురేష్ తెలిపారు. అయితే అలేఖ్యతో వివాహం తర్వాత తల్లిదండ్రులతో తారకరత్నకు మాటలు ఉన్న కొంత గ్యాప్ మాత్రం ఉండేదని తెలిపారు. ప్రస్తుతం తారకరత్న స్నేహితుడు సురేష్ చెప్పిన ఈ వాక్యాలు వైరల్ గా మారుతున్నాయి.