ఇండియన్ మోస్ట్ స్టార్స్ జాబితాని విడుదల చేసిన ఒర్మాక్స్ ..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇండియా వైడ్ గా మోస్ట్ పాపులర్ సెలబ్రిటీలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రకటిస్తూ ఉంటారు ఒర్మాక్స్ సంస్థ.ఎక్కువ కాలం ట్రెండీ గా కొనసాగిన హీరోల పాపులారిటీ ఆధారంగా ఒర్మాక్స్ వెబ్ సైట్ ప్రతి నెలలో మోస్ట్ పాపులర్ హీరోల జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది.ఈసారి మొదటి స్థానంలో ఇళయదళపతి విజయ్ ముందంజలో ఉన్నాడు. జనవరిలో రిలీజ్ అయిన వారసుడు మూవీతో విజయ్ క్రేజీ సంపాదించుకున్నారు.. దీంతో సోషల్ మీడియాలో పాపులర్ జాబితాలో విజయ్ పేరు ఉంది.

Image

ఇక రెండో స్థానంలో అల్లు అర్జున్ పేరు ప్రముఖంగా ఉండటం విశేషం. అల్లు అర్జున్ నుంచి ఎలాంటి సినిమా రాకపోయినా పుష్ప మూవీ షూటింగ్ జనవరిలో స్టార్ట్ అయింది కాబట్టి టాప్-2 గా అల్లు అర్జున్ నిలిచాడు.
ఇక ఇండియన్ వైడ్ మూడో స్థానంలో షారుక్ ఖాన్ పఠాన్ నిలవడం విశేషం . ఇలా మోస్ట్ పాపులర్ మెయిల్ స్టార్స్ జాబితాలోకి రావడం మొదటిసారి అని చెప్ప వచ్చు.నాలుగో స్థానంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఉండటం విశేషం , ఐదో స్థానంలో అక్షయ్ కుమార్ నిలిచాడు. ఆరో స్థానంలో తమిళ్ హీరో సూర్య ఉన్నాడు.

ఇక ఏడో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఎనిమిదో స్థానంలో అజిత్ కుమార్, తొమ్మిదో స్థానంలో రామ్ చరణ్, పదో స్థానంలో రాకింగ్ స్టార్ యష్ నిలిచారు. అయితే ప్రతి నెలలో మోస్ట్ పాపులర్ హీరోల జాబితా మారుతూనే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం కొంతమంది టాలీవుడ్ హీరోల సైతం అవకాశాన్ని సంపాదించుకోలేకపోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది. దీంతో బిజీ ఫ్యాన్స్ మాత్రం కాస్త హ్యాపీగా ఉన్నారని చెప్పవచ్చు.

Share.