తారకరత్న గుండెపోటుతో హాస్పిటల్లో గత 23 రోజులుగా చికిత్స తీసుకుంటూ ఫిబ్రవరి 18వ తేదీన తుది శ్వాస విడిచిన ఘటన యావత్ సినీ లోకాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. సోమవారం రోజు సాయంత్రం మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు కుటుంబ సభ్యులు.. ఇకపోతే ఇదంతా కాసేపు పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో తారకరత్న మరణం గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది..
అసలు విషయం ఏమిటంటే.. లోకేష్ పాదయాత్రలో తారకరత్న ఎప్పుడైతే గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయారో.. ఆ రోజే ఆయన గుండె ఆగిపోయిందని.. డాక్టర్లు సీపీఆర్ చేసినా లాభం లేకుండా పోయిందనే ఒక వార్త సంచలనం సృష్టించింది.. అందుకు సంబంధించిన రిపోర్టులు కూడా డాక్టర్లు ఇచ్చారని సమాచారం. అయితే లోకేష్ పాదయాత్ర ఎక్కడ ఆగిపోతుందో అనే భయంతోనే ఈ విషయాన్ని ఇన్ని రోజులు దాచి పెట్టారని.. మృతదేహం పాడవకుండా ప్రత్యేకంగా డాక్టర్లను పిలిపించి ఏదోలా మేనేజ్ చేశారని పలు రకాలుగా కొంతమంది ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
మరొకవైపు వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి కూడా తారకరత్న ఎప్పుడో చనిపోయాడు అంటూ ఒక మాట కలపడంతో ఇది నిజమేనని చాలామంది నమ్మేలా చేశారు..నిజానికి చనిపోయిన ఒక మనిషి శరీరాన్ని 20 రోజులకు పైగా పాడవకుండా ఎవరైనా చేయగలరా? ఒకవేళ చేయాలి అనుకుంటే ఫ్రీజర్ లాంటి చోట్ల తారకరత్నను ఉంచాలి.. కానీ ఆయనను అలా ఉంచకుండా చికిత్స తీసుకుంటూ ఉన్న ఫోటోలను ఇదివరకే సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే రాజకీయ నాయకులు కూడా ఇలా తారకరత్న మరణానికి రంగులు పులుముతూ టిడిపి పై అబాండాలు వేస్తున్నారు అంటూ టిడిపి నాయకులు వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై చంద్రబాబు, లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.