నందమూరి తారకరత్న 39 సంవత్సరాల వయసులోనే గుండెపోటుతో మరణించి ఇండస్ట్రీకి తీరని దుఃఖాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒంటరి అయిన ఆయన కుటుంబానికి అండగా ఎవరు ఉంటారనే వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే బాలయ్య బాబు.. తారకరత్న ముగ్గురు పిల్లలను, ఆయన భార్య అలేఖ్య ను సొంతబిడ్డల్లాగా చూసుకుంటానని ప్రకటించి తన మంచి మనసును చాటుకున్నాడు. అయితే ఇలాంటి సమయంలోనే తారకరత్న ఆస్తుల గురించి చర్చ జరుగుతోంది.ఆయనకి ఎంత ఆస్తి ఉంది. అనే విషయాలు ఇప్పుడు ఒకసారి చూసి తెలుసుకుందాం.
తారకరత్న తండ్రి నందమూరి మోహన్ కృష్ణ హైదరాబాదులో రామకృష్ణ థియేటర్స్ తో పాటు తారకరత్న థియేటర్స్ ను కూడా నిర్మించారు. కొన్ని హోటల్ బిజినెస్ లు కూడా ఉన్నాయి. మరొకవైపు ఎంకే ట్రేడర్స్ పేరిట వ్యాపారం కూడా ఉంది. వీళ్ళ ఇల్లు, ప్రాపర్టీస్, కమర్షియల్ కాంప్లెక్స్ లు అన్నీ కలిపి దాదాపుగా మార్కెట్ విలువ ప్రకారం రూ.1000 కోట్లకు పైగా ఉంటుందనేది సమాచారం. అటు తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి పేరిట తల్లిదండ్రులు దాదాపు రూ.250 కోట్ల వరకు ఆస్తులు రాసినట్లు సమాచారం.
తారకరత్న కూడా ఒక రూ.250 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టి ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే తారకరత్నకు రూ.1500 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.. ఇకపోతే హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే అన్ని సినిమాలతో రావడం అంటే చిన్న విషయం కాదు.. కానీ తారకరత్న విషయంలో ఇదే జరిగింది. నందమూరి బ్యాగ్రౌండ్ అనేది కీ రోల్ పోషించిందని చెప్పాలి. 2022లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో వచ్చిన ఆ తర్వాత ఎనిమిది సినిమాలను కూడా అదే రోజు మొదలుపెట్టి ఇండస్ట్రీ రికార్డు సృష్టించారు తారకరత్న.