కన్నడ హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి అతి చిన్న సినిమా కాంతారా తో ఒక్కసారిగా యావత్తు ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. కాంతారా మూవీ విడుదలై అన్ని భాషల్లో కూడా హిట్ కొట్టడంతో కన్నడ చిత్ర పరిశ్రమ ఖ్యాతి కూడా ఖండాంతరాలను దాటి గ్లోబల్ ప్లాట్ ఫామ్ పై మెరిసినట్లు అయింది. కనీసం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించకుండానే గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన ఈ సినిమా విడుదల చేశారు చిత్ర బృందం.కేవలం రూ.16 కోట్లతో హోం భలే ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఊహించని విధంగా రూ. 450 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ రికార్డు క్రియేట్ చేసింది.
ఈ సినిమాకు నటుడిగా , దర్శకుడిగా , రచయితగా వ్యవహరించింది రిషబ్ శెట్టి మాత్రమే.. సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును తాజాగా ఆయన మోస్ట్ ప్రామిసింగ్ హీరో జాబితాలో సొంతం చేసుకోవడం జరిగింది. కాంతారా మూవీ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు నటుడు రిషబ్ శెట్టి.. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ.. నా ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దివంగత కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్ కుమార్ , లెజెండ్రీ డైరెక్టర్ ఎస్.కె భగవాన్లకు అంకితం చేస్తున్నాను అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్రీట్ చేశారు.
నా ఈ చిన్న డ్రీమ్ ను సహకారం చేసిన మా కాంతారా చిత్ర బృందానికి కృతజ్ఞతలు.. నా లైఫ్ కి మూల స్తంభం అయిన నా భార్య ప్రగతి శెట్టి లేకుండా ఇది అసాధ్యం అంటూ ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Congratulations @shetty_rishab on winning the #DadasahebPhalkeAward! Your hard work and dedication have paid off in the most amazing way. May the dream run continue. Here’s to many more successes! #Kantara https://t.co/FX01RdrIpC
— Hombale Films (@hombalefilms) February 21, 2023