బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన గోవిందం

Google+ Pinterest LinkedIn Tumblr +

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఈ పేరు టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియా అంతటా మారుమోగుతోంది. అతి కొద్దీ కాలంలోనే యూత్ ఐకాన్ గా మారిపోయారు ఈ యువ హీరో. కేవలం ‘ అర్జున్ రెడ్డి ‘ అనే ఒక బోల్డ్ సినిమాతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు విజయ్. టాలీవుడ్ లో ఉన్న ఎంతో మంది యువ హీరోలకి విజయ్ సాధిస్తున్న వరుస విజయాలు ఒక సవాలుగా మారాయి. ఇక ఇప్పుడు తన తాజా చిత్రం ‘గీత గోవిందం’ సక్సెస్ తో ఏ పీ, తెలంగాణ లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా తన సత్తా చాటుతున్నాడు మన గోవిందుడు. యూ ఎస్ ఏ లో 2 మిలియన్ డాలర్స్ కి చేరువ లో ఉంది గీత గోవిందం.

ఇక ఆస్ట్రేలియా లో కూడా ఈ సినిమా పెద్ద ప్రభంజనమే సృష్టిస్తుంది. ఎన్నో బాలీవుడ్ సినిమాలకు సాధ్యం కానీ రికార్డులని గోవిందం కేవలం మూడు అంటే మూడు రోజుల్లోనే సాధించింది. తాజాగా విడుదలైన అక్షయ్ కుమార్ ‘గోల్డ్’ మరియు జాన్ అబ్రహం నటించిన ‘ సత్యమేవ జయతే ‘ సినిమాల కల్లెక్షన్లని గీత గోవిందం తొలి వీకెండ్ లోనే బీట్ చేసింది.

ఆస్ట్రేలియా లో విడుదలైన గోల్డ్, సత్యమేవ జయతే సినిమాలు రెండు కలిపి తొలి వీకెండ్ లో 192,306 ఆస్ట్రేలియన్ డాలర్స్ కలెక్ట్ చేయగా, గీత గోవిందం సినిమా ఒక్కటే 202,266 ఆస్ట్రేలియన్ డాలర్స్ వసూలు చేసింది. ఈ దెబ్బతో విజయ్ దేవరకొండ క్రేజ్ ఇప్పుడు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ లో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల వివరాలు సేకరించే సంస్థ ‘ కామ్ స్కోర్ ‘ ఈ వివరాలని వెల్లడించింది.

Share.