ఏ ఇండస్ట్రీలో నైనా సరే ప్రేమ వివాహాలు సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అయితే కొంతమంది ప్రేమించుకున్న తర్వాత ఆ బంధాన్ని పెళ్లి వరకు తీసుకొని వెళుతుంటారు. మరి కొంతమంది మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. అలా స్టార్ హీరోయిన్స్ , హీరోస్ సైతం విఫలమైన వారి గురించి తెలుసుకుందాం.
అక్కినేని అఖిల్:
ఏప్రిల్ 8 1994లో అక్కినేని నాగార్జున, అక్కినేని ఆమల దంపతులకు జన్మించాడు. ఆయన 16వ ఏట సినీ ప్రస్థానంలో అడుగుపెట్టారు అఖిల్ ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలోనే శ్రేయ భూపాల్ తో ప్రేమలో పడ్డారు. ఇద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఆ వెంటనే విడిపోవడం జరిగింది.
కత్రినా కైఫ్:
ఈమె బాలీవుడ్ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఆమె తుల చిత్రంగా 2003లో బూమ్ విడుదలై ప్లాప్ గా నిలిచింది. అయితే ఈమె కూడా సల్మాన్ ఖాన్ తో ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించాయి. తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయారు.
రష్మిక మందన్న:
. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరుపొందింది.ఆమె 2016లో కిరాక్ పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా నటిగా పరిచయం అయ్యింది. ఈ సినిమాతో రష్మిక , రక్షిత్ శెట్టి ప్రేమలో పడిపోయారు. ఆ తర్వాత వివాహం చేసుకోవాలని నిశ్చితార్థం చేసుకున్న.. క్యాన్సిల్ చేసుకున్నారు.
విశ్వక్ సేన్:
టాలీవుడ్ లో యంగ్ హీరో గా పేరు పొందారు. దర్శకుడు మరియు స్క్రీన్ ప్లే రచయిత. ఆయన అసలు పేరు దినేష్ నాయుడు కాగా.. ఈయనకు బ్రేకప్ అయినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
దీపిక పదుకొనే :
బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు పొందింది.2018 లో నటుడు రణ్వీర్ సింగ్ ను వివాహం చేసుకుంది.. అంతకంటే ముందు..రణబీర్ కపూర్ తో కొంతకాలం ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి.. తర్వాత వీరిద్దరు విడిపోయినట్లు వార్తలు వినిపించాయి.
ఇక వీరితో పాటే టాలీవుడ్ హీరోయిన్ మొహరీన్, ఆర్తి అగర్వాల్, నటుడు అడవి శేషు, ఇలియానా తదితర నటీనటులు కూడా ఈ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది.