టిడిపి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా నందమూరి తారకరత్న పాల్గొనడం జరిగింది. ఇందుకు సంబంధించిన అన్ని పనులను కూడా తానే దగ్గరుండి చూసుకున్నారు. అయితే పాదయాత్ర రోజున టిడిపి కార్యకర్తలతో పాటు నడుచుకుంటూ వెళ్లిన తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోవడం జరిగింది. దీంతో వెంటనే కుప్పంలో ఉన్న ఆసుపత్రికి తరలించగా.. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోనే నారాయణ హృదయాలయకు తీసుకు వెళ్లడం జరిగింది దాదాపుగా 23 రోజులపాటు ఇక్కడే చికిత్స తీసుకుంటున్నారు.
కానీ నిన్నటి రోజున పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తారకరత్న మరణించినట్లుగా తెలుస్తోంది. ఇక తారకరత్న ఆరోగ్య పరిస్థితి హాస్పిటల్ లో చేరినప్పటి నుంచి ఎలా ఉందంటే.. తారకరత్న పరిస్థితి వైద్యులకు అంత చిక్కకపోవడంతో పలువురు స్పెషలిస్టులను కూడా విదేశాల నుంచి రప్పించారట. అయితే ఈ విషయంపై ఆటు అభిమానులలో కాస్త సంతోషాన్ని అని నింపినప్పటికీ నిన్నటి రోజున తారకరత్న మరణించడంతో అటు అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారిగా శోక సముద్రంలోకి మునిగిపోయారు. 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న నిన్నటి రోజున తుది శ్వాస విడిచడం జరిగింది.
అయితే తారకరత్న బతికించలేకపోవడానికి ముఖ్య కారణం మొదటి రోజు చేసిన తప్పే అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.హార్ట్ ఎటాక్ వచ్చిన వ్యక్తికి సిపిఆర్ అనేది నిమిషాలలో చేయాలట.. కానీ తారకరత్న విషయంలో సిపిఆర్ చేయడానికి దాదాపుగా 45 నిమిషాల సమయం ఆలస్యమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సిపిఆర్ అందాల్సిన టైంలో కాకుండా లేటుగా చేయడం వల్లే దాని ప్రభావం హార్ట్ హోల్స్ పైన పడి బ్లడ్ క్లాట్ అయి బ్రెయిన్ కు సప్లై ఆగిపోవడంవల్లే తారకరత్నకు ఈ పరిస్థితి ఎదురైందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.