జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రేక్షకులకు తెలియని వారంటూ ఎవరు ఉండరు. 20 ఏళ్ల వయసుకే స్టార్ హీరోగా ఎదిగిన ఎన్టీఆర్ ఎంతో క్రేజీ ని సంపాదించాడు. ఈ మధ్య బుల్లితెరలో కూడా ఒక షోలలో , పలు యాడ్లలో నటిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ కెరియర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు ఉన్నాయి.RRR సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు పొందడమే కాకుండా ఎన్టీఆర్ మరొకసారి తన స్టామినా ఏంటో చూపించారు. ఇందులో రామ్ చరణ్ కూడా నటించడం జరిగింది. ఏకంగా ఈ సినిమాతో ఆస్కార్ అవార్డు రేసులోనే నిలిచారు ఎన్టీఆర్
ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబో లో మరొక సినిమా ఓకే చేశారు. అయితే ఆ సినిమాకి టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు.. గతంలో ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబో లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ చిత్రం గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ – వ సినిమాకి భారీ అంచనాలు నెలకొన్నాయి.. ప్రస్తుతం తాజాగా చిత్రం ఈ నెల 24 న సెట్ మీదకు వెళ్లబోతోంది. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు మరియు వీడియోలను బట్టి ఈ చిత్రం సముద్రం పోర్టు స్మగ్లింగ్ నేపథ్యంలో అల్లుకున్న కథ అన్నట్లుగా తెలుస్తోంది.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ మరింత వైరల్ గా మారింది. ఈ మూవీలో ఎన్టీఆర్ తండ్రి , కొడుకు పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. రివేంజ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇకపోతే ఎన్టీఆర్ బర్త్డే కానుకగా వచ్చిన ఒక మాస్ మోషన్ పోస్టర్ గ్లిoప్స్ అందరినీ ఆకట్టుకుంది…. ఇక ఎన్టీఆర్ ద్విపత్రాభినయం చేశారంటే ఆ సినిమా దాదాపుగా సక్సెస్ బాటే పడుతుందని అభిమానులు కూడా నమ్ముతున్నారు మరి ఏ మేరకు ఈ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి మరి.