టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో నటి ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో అందంతో ఎంతోమందిని ఆకట్టుకుంది.జంపలకడి బంప సినిమాతో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఆమని. ఆ తర్వాత మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం తదితర వంటి చిత్రాలలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. అలాంటి సమయంలోనే పెళ్లి చేసుకుని పెళ్లి తర్వాత హీరోయిన్ గా మాత్రమే కాకుండా చిన్న చిన్న పాత్రలలో కూడా నటించింది. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ పలు పాత్రలలో నటిస్తూ ఉంటుంది ఆమని.
ఇదంతా ఇలా ఉంటే తనని గతంలో కొంతమంది ఎగతాళి చేశారని పెద్ద అందేత్తవి కాదు అన్నారని ముఖం మీద చెప్పేసరికి చాలా బాధపడ్డాను అని తెలియజేస్తోంది ఆమని. ఆమని ఏకంగా 100కు పైగా సినిమాలలో హీరోయిన్గా నటించింది. కెరియర్ డౌన్ ఉన్న సమయంలో 2012లో ఖాజా మీడిన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.వీరికి ఒక కూతురు కూడా జన్మించింది ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తన సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తూ ఉంటోంది. భరత్ అనే నేను చిత్రంలో మహేష్ కు తల్లిగా నటించింది. ఆ తర్వాత బుల్లితెర పైన పలు సీరియల్స్ లో హోస్ట్ గా కూడా వ్యవహరిస్తోంది.
ఆమెని మేనకోడలు కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అల్లంత దూరాన అనే సినిమాలో ఆమని కోడలు హీరోయిన్గా నటిస్తోంది. ఆమెని సినిమాలలోకి రావాలనుకో లేదట. కానీ అవకాశం రావడంతో వచ్చేసానని తెలిపింది కానీ సినిమాలకు వచ్చాక.. మాత్రం చాలా దారుణంగా మోసపోయానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. తన కుటుంబానికి ఎవరు బ్యాగ్రౌండ్ లేకపోవడంతో తనని అందరూ మోసం చేశారని తన తమ్ముడు చాలా చిన్నవాడని తన తల్లికి చదువు లేకపోవడం వల్ల ఎన్నో లక్షలు సంపాదించిన ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియక మేనేజర్లు ఇండస్ట్రీ వారిని నమ్మి మోసపోయినట్లుగా తెలిపింది.