వారసుడు మావి ద్వారా దిల్ రాజుకు ఎంత లాభం అంటే..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

విజయ్ దళపతి హీరోగా నటించిన సినిమా వారసుడుఈ సినిమాని వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. హీరోయిన్గా రష్మిక నటించింది. ఇక జయసుధ, శరత్ కుమార్, శ్రీకాంత్ ,సంగీత్ శ్యామ్ ఇలా తదితర నటీనటులు సైతం ఇందులో నటించడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాని దిల్ రాజు దాదాపుగా రూ.200 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. జనవరి 14వ తేదీన విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఫ్యామిలీ ఎమోషన్స్ లవ్ యాక్షన్ ఇలా అన్నిటి గురించి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది.

TFPC goes against Dil Raju-produced 'Varasudu' - Telugu News -  IndiaGlitz.com

తెలుగులో ఈ పాయింట్ తో ఇప్పటికి ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి అన్నిటికీ మిక్స్ చేసి తీసిన సినిమాలో ఉండడంతో తెలుగులో కథగా ఆకట్టుకోలేక పోతుంది. కానీ తమిళంలో మాత్రం కలెక్షన్ల పరంగా భారీగానే రాబట్టింది వారిసు. సంక్రాంతి పండుగ వేళ రిలీజ్ కావడంతో ఈ సినిమాకు కాస్త ప్లస్ అయిందని చెప్పవచ్చు. సంక్రాంతి సమయంలో తన ఇండస్ట్రీ నుంచి ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు విడుదలయ్యాయి అందులో అజిత్ నటించిన తునివు సినిమాని విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో తెగింపు పేరుతో విడుదల చేయడం జరిగింది.

ఇక మూడు రోజుల్లో రూ.100 కోట్ల క్రాస్ కలెక్షన్లను రాబట్టింది. తెలుగులో ఒక మోస్తారు వసూల్ ని రాబట్టిన ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ .300 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీంతో రూ .150 కోట్ల రూపాయలు షేర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ తో పోలిస్తే ఇంకా రూ .180 కోట్లు రాబడితే తప్ప లాభాలు వచ్చేలా కనిపించలేదు. డిస్ట్రిబ్యూటర్ కు లాభాలు వచ్చే అవకాశం తక్కువగా ఉందని చెప్పవచ్చు నిర్మాతగా దిల్ రాజుకు మాత్రం ఓటిటి రైట్స్ శాటిలైట్ రైట్స్ ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది.

Share.