పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన రాశి ఖన్నా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్లలో రాశి ఖన్నా కూడా ఒకరు. ఈమె నటించిన తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పాపులరిటి నే సంపాదించుకుంది. ఈమె తెలుగులోనే కాకుండా తమిళంలోనూ పలు చిత్రాలలో నటించింది.కేవలం వెండి తేరపైనే కాకుండా ఓటిటిలోనూ తన సత్తా చాటుతోంది .ఇటీవలే రుద్ర వెబ్ సిరీస్ తో డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంటర్ అయ్యింది ఈ అమ్మడు..

Rashi Khanna Age, Height, Earning, Films, Affairs and More

ప్రస్తుతం ఫర్జీ సిరీస్ లో ఓ లీడ్ రోల్ చేస్తోంది. అందులో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, రెజీనా ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఈనెల పది నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైయింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఆసక్తికర కామెంట్స్ చేయడం జరిగింది.అలాగే తను చేసే కొత్త సినిమాల గురించి అనౌన్స్మెంట్ చేయకపోవటానికి గల కారణాలు కూడా చెప్పుకొచ్చింది.

ఇప్పుడు నేను చేస్తున్న ఫర్జీ సిరీస్ సినిమాకి మంచి మంచి స్పందన వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే తన నటనపై.. సమంత, కీర్తి సురేష్ చాలా బాగుంది అంటూ తెలిపారని తెలుపుతోంది.అంతేకాకుండా ఎంతో మంది దర్శక నిర్మాతలు కూడా కంగ్రాట్స్ చెప్పారు. ముఖ్యంగా తెలుగు, తమిళ్ ఆడియోస్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే నేను పెళ్లి కోసం సినిమాలకు బ్రేక్ ఇవ్వలేదు. తెలుగులో మూడు సినిమాలు తమిళంలో మూడు సినిమాల కథలు విన్నాను. అవి ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి. ఫర్జీ రిలీజ్ తర్వాత ఓ నిర్ణయం తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను.

ఇప్పటివరకు నేను ఎక్కువగా లవ్ స్టొరీ , కామెడీ రోల్స్ కూడా చేశాను. కానీ నాకు యాక్షన్ ఫిలిం చేయాలని ఉంది. ముఖ్యంగా బాహుబలిలో అనుష్క గారు చేసిన యువరాణి లాంటి పాత్రలను చేయాలని ఉంది .అంటూ రాశి ఖన్నా ఈ సందర్భంలో తెలిపారు.

Share.