టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్, హీరోలు అందరూ కూడా ఆటల మాది కూడా త్రివిక్రమ్ డైరెక్షన్లో కనీసం ఒక్కసారైనా నటించాలని అనుకుంటు ఉంటారు. అందుకు కారణం ఏంటి అని అడిగితే చాలామంది చెబుతున్న సమాధానం ఏమిటంటే త్రివిక్రమ్ డైరెక్షన్లో చేసే ప్రతి ఒక్కరికి కూడా మంచి పేరుతో పాటు యాక్టింగ్ కూడా చాలా బెటర్ పర్ఫామెన్స్ కలిగి ఉంటుందని వాళ్ల నమ్మకం అన్నట్లుగా తెలుస్తోంది. అందుకోసమే ఆయన సినిమాలలో చిన్న అవకాశం వచ్చినా కూడా వదులుకోకుండా చేస్తూ ఉంటారు.
అయితే ఇక అసలు మ్యాటర్ కి వస్తే.. త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా వచ్చిన ఖలేజా చిత్రంలో అనుష్క హీరోని గా చేసిన సంగతి తెలిసిందే ..అనుష్క కంటే ముందు ఈ సినిమా కోసం సెలెక్ట్ చేసిన మరొక హీరోయిన్ ఎవరంటే పార్వతి మిల్టన్.. అయితే ఆమె అప్పటికే జల్సా సినిమాలో నటించింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఖలేజా మూవీలో మెయిన్ హీరోయిన్ గా తీసుకుందామనుకున్నారట. కానీ దానికి ఆమె ఒప్పుకోలేదని ఇండస్ట్రీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.
ఎందుకనే విషయాన్ని పార్వతి మిల్టన్ ని అడగగా ఆ స్టోరీలో హీరోయిన్ కు ఎక్కువగా ఇంపార్టెంట్ లేదని.. అందుకే ఈ సినిమా అవకాశాన్ని వదులుకున్నానని తెలియజేసినట్లు సమాచారం. కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. ఒకవేళ స్టార్ హీరోలతో సినిమాలో అవకాశం వచ్చింది అని ఒప్పుకొని ఉంటే.. మరికొన్ని సినిమాలలో కూడా అవకాశం వచ్చేది అని తెలియజేసింది. అయితే త్రివిక్రమ్ కు, పార్వతి మిల్టన్ మీద ఇష్టంతోనే ఈమెకు అవకాశాలు ఇప్పించారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.