ఈటీవీలో ప్రచారం అవుతున్న జబర్దస్త్ షో చాలామంది కమెడియన్స్ కు మంచి భవిష్యత్తును ఇచ్చింది.అలాంటి జబర్దస్త్ కు ఇప్పుడు కొన్ని మార్పులు జరగబోతున్నాయి. జబర్దస్త్ కి పాత కమెడియన్స్ చాలామంది దూరమయ్యారు. అలాగే యాంకర్స్ కూడా దూరమయ్యారు. ఇప్పుడు యాంకర్ గా కన్నడ బ్యూటీ సౌమ్య ఈ షోను నిర్వహిస్తోంది. కానీ ఈమె ఎంతవరకు జబర్దస్త్ కార్యక్రమాన్ని ముందుకు సాగేలా చేస్తుందో ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది మల్లెమాల టీమ్ కి
ఇక త్వరలోనే కొత్త యాంకర్ ని తీసుకురావాలని మల్లెమాల అనుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ షో కి యాంకర్ గా అనసూయ, రష్మీ గౌతమ్, సౌమ్య వ్యవహరించారు. కానీ ఇప్పుడు శ్రీముఖి రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఇక శ్రీముఖి పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పనవసరమే లేదు. గతంలోనే జబర్దస్త్ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం అందిందట.కానీ ఆ సమయంలో ఈమె చాలా బిజీగా ఉండటంతో నో చెప్పిందట మళ్లీ పదేళ్ల తర్వాత శ్రీముఖికి అవకాశం వచ్చింది.
ఇక మల్లెమాల వారితో కలిసి చాలా కార్యక్రమాలను చేసింది శ్రీముఖి. అందుకే జబర్దస్త్ కార్యక్రమానికి కూడా శ్రీముఖిని తీసుకొచ్చి రేటింగ్ పెంచాలని భావిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఒకప్పుడు జబర్దస్త్ అంటే ప్రేక్షకులు టీవీ నుంచి పక్కకు వచ్చేవారు కాదు. ఇప్పుడు అంతా కొత్తవారు రావటంతో కొంచెం గందరగోళంగా ఉంది. అందుకనే మల్లెమాలవారు ప్లాన్ చేసి శ్రీముఖిని యాంకర్ గా తీసుకుంటే షో రసవత్తరంగా ఉంటుందని అనుకుంటున్నారట. ఇక అందులో భాగంగానే కొత్త కమెడియన్స్ మరియు యాంకర్ తో పాటు జడ్జిలను కూడా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి త్వరలోనే కొత్త యాంకర్స్ కొత్త మార్పు కొత్త జబర్దస్త్ కలకలలాడబోతుంది. అంటూ ఈ టీవీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.