తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .. ఆ ఇంటి నుంచి ఎంతోమంది హీరోలు వచ్చారు.. కానీ హీరోయిన్ గా మాత్రం నిహారికనే వచ్చింది. చిరంజీవి ఇంటి నుంచి తన కొడుకు మాత్రమే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కూతుర్ల విషయానికి వస్తే ఒక్కరు కూడా సినీ రంగంలోకి ప్రవేశించలేదు. మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. నిహారిక సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు తీసినప్పటికీ హీరోయిన్ గా ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు. ఆ తరువాత పెద్దలు కుదిరిచిన వివాహం చేసుకొని తన వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.
ఇలా నిహారికను మెగా అభిమానులు ఆదరించకపోవడంతో సినిమాపై ఇంట్రెస్ట్ తగ్గకపోవడంతో హీరోయిన్ గా కాకుండా నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతోంది.ఇప్పుడు నిహారిక హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా చేస్తున్న సమయంలో చాలా మంది నిహారికకు తల పొగురు ఎక్కువగానే ఉంది. చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది అంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు
ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో నిర్మాత ఏయం రత్నం కుమారుడు సుమంత్ అశ్విన్ నిహారిక గురించి పలు విషయాలను తెలియచేశారు. నిహారికను ట్రోల్ చేసిన ప్రశ్న ఈయనకు ఎదురుకావడంతో అశ్విన్ సమాధానం చెబుతూ.. అసలు మెగా ఇంటి నుంచి వచ్చిన నిహారికకు ఏమాత్రం పొగరు కానీ ఇగో కానీ ఏమీ లేవని తాను చాలా అల్లరి చేస్తూ గోలగోల చేస్తూ లొకేషన్ మొత్తం సందడి చేస్తూ ఉంటారని సుమంత్ అశ్విన్ తెలిపారు. అంత గొప్పింటి నుంచి వచ్చిన నిహారిక ఓ సాధారణ వ్యక్తి లాగా అందరిలో కలిసిపోతూ ఉంటుంది. నిహారిక మీద వస్తున్న వార్తలు పూర్తిగా తప్పు అంటూ కొట్టు పడేశారు. దీంతో అశ్విన్ చెప్పిన ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.