టాలీవుడ్ లో టాప్ టెన్ హీరోస్ వీళ్లే..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు అయితే ఈ మధ్యకాలంలో వరుసగా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. అయితే టాలీవుడ్ లో ఇటీవల అత్యధిక స్థాయిలో క్రేజీ సంపాదించుకున్న లిస్టును ఓర్మాక్ సమస్త రిలీజ్ చేయడం జరిగింది. ఇది జనవరి నెలలకు సంబంధించి ఆధారంగా సర్వే చేసి ఎక్కువ పాపులర్ అయిన టాప్ టెన్ హీరోల ర్యాంకును విడుదల చేయడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం.

ప్రభాస్ మరొకసారి మొదటి స్థానంలో నిలిచి తన క్రేజ్ ను నిరూపించుకున్నారు. రాధే శ్యామ్ డిజాస్టర్ తర్వాత కూడా ప్రభాస్ రేంజ్ అసలు తగ్గలేదు ఏదో ఒక విషయంలో గాసిప్ రూపంలో వైరల్ గా మారుతూనే ఉన్నారు. ఇక రెండవ స్థానంలో ఎన్టీఆర్ నిలవడం జరిగింది ఇటీవలే RRR చిత్రంలోని నాటు నాటు పాట ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక మూడవ స్థానంలో రామ్ చరణ్ కూడా అంతర్జాతీయ లెవెల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత స్థానం అల్లు అర్జున్ నిలబడడం జరిగింది.

ఇక ఐదవ స్థానంలో మహేష్ బాబు నిలబడ్డారు తాజాగా మహేష్ బాబులు కు సంబంధించి పలు ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ర్యాంకు ఈసారి మరికొంత తగ్గిందని చెప్పవచ్చు ఆరవ స్థానంలో ఉన్నారు. ఇక చిరంజీవి గడిచిన మూడు నెలల నుంచి ర్యాంకును సంపాదిస్తూ వస్తున్నారు ఇందులో ఏడవ స్థానంలో నిలిచారు.. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని దసరా సినిమాతో పాపులర్ కావడంతో ఎనిమిదో ర్యాంకుని సంపాదించుకున్నారు. ఇక ధమాకా సక్సెస్ తో మంచి విజయాన్ని అందుకున్న రవితేజ 9వ స్థానంలో ఉండగా చివరి గా 10 వ స్థానంలో విజయ్ దేవరకొండ స్థానాన్ని సంపాదించుకున్నారు.

Share.