టాలీవుడ్ హీరోయిన్స్ కు వరుసగా ఈ మధ్య అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.. ముఖ్యంగా ఒక్కొక్కరికి తమకున్న ఆరోగ్య సమస్యల గురించి బయట పెడుతూ ఉంటే అభిమానులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న సమంత కూడా వయోసైటీస్ వ్యాధి బారిన పద్ధతులుగా తెలియజేయడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇంకా ఈమె ఈ వ్యాధి నుంచి తేలుకోలేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా గడిచిన రెండు రోజుల క్రితం తన అనారోగ్య సమస్యను బయటపెట్టింది. ఈమె మరాఠీ అమ్మాయి అయినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో మంచి పేరు సంపాదించింది. రేణు దేశాయ్ గుండెకు సంబంధించి వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలియజేస్తోంది. అందుకు సంబంధించి ఒక కొటేషన్ కూడా పోస్ట్ చేస్తూ రాసుకుంది. ఇక అలాగే ఈ ప్రపంచంలో మన కోసం ఎన్నో సర్ప్రైజ్లు ప్లాన్ చేసింది నవ్వుతూ వాటిని ఎదుర్కోవడమే మన పని అన్నట్టుగా రాసి వచ్చింది రేణు దేశాయ్.. దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహ పడుతున్నారు.
ఇక హీరోయిన్ అనుష్క శెట్టి కూడా ఓరేర్ డిసీజ్ తో బాధపడుతున్నదట. నవ్వడం మొదలు చేస్తే అసలు ఆపుకోలేదట దాదాపుగా 20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటుందట.. ఇ విషయాన్ని అనుష్క నే చెప్పి షాక్ ఇచ్చింది. అలాగే తమిళ హీరో జీవా నటించిన రంగం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఫియాబాజ్ కూడా తాను కూడా మయోసైటీస్ వ్యాధిన బాధపడుతున్నట్లుగా తెలియజేసింది. ఇక ఈమె కాకుండా నటి కల్పిక గణేష్ కూడా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలియజేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే హీరోయిన్లకు ఏదైనా శాపం తగిలిందా అన్నట్లుగా పలువురు అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు.