జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీ అందుకున్న వారిలో జబర్దస్త్ పవిత్ర కూడా ఒకరు.. అనుకోకుండా పాపులర్ కావడంతో జబర్దస్త్ కమెడియన్ గా కూడా స్థిరపడింది. తాజాగా తన కుటుంబంలో జరిగిన కొన్ని విషయాలను సైతం ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. జబర్దస్త్ పవిత్ర మాట్లాడుతూ మాది చాలా లో క్లాస్ ఫ్యామిలి అని ..పని చేస్తేనే పూట గడవడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి కుటుంబంలో నుంచే నేను బయటికి వచ్చాను అని జబర్దస్త్ పవిత్ర తెలుపుతోంది.
మూడు పూటలా తినడానికి కూడా అందరము ఆలోచించే వాళ్లమని తెలిపింది.తన తండ్రి లారీ డ్రైవర్ అని ఆయన ఒక డ్రింకర్ అని అమ్మ ఫార్మర్ అయినప్పటికీ కూడా అలాగే నెట్టుకొస్తూ ఉండేదని తెలిపింది. పవిత్ర ఇంటర్ వరకు చదివి ఆదాయం కోసం కెరియర్ పరంగా రూట్ మార్చానని తెలిపింది.తన తండ్రి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసేవారు కాదని నాన్న ప్రపంచమే వేరంటూ కన్నీరు పెట్టుకొని తెలుపుతోంది. తన తండ్రి సరిగ్గా ఇంటికి వచ్చేవారు కాదని నాన్న ప్రేమను చాలా మిస్ అయ్యానని తెలిపింది.
ముఖ్యంగా పవిత్ర జోక్స్ వేస్తుంటే తన స్నేహితులు బాగా నవ్వే వారు అని కూడా తెలిపింది. జబర్దస్త్ ఇతర కామెడీ షో లను చూసి ఇన్స్పైర్ అయ్యారని పవిత్ర తెలిపింది సెలోన్ ఏర్పాటు చేశానని అయితే దానిని మెయింటైన్ చేయడం చాలా కష్టంగా మారిందని తెలిపింది. మాకు సొంత ఇల్లు కూడా ఉండేది కాదంటూ చెప్పుకొస్తుంది ఇటీవల తన తండ్రి మరణించారని తెలుపుతూ ఏడవడానికి కూడా కన్నీళ్లు రాలేదని తెలిపింది.13 ఏళ్లుగా నాన్నతో మాట్లాడే దానిని కాదంటూ తెలిపింది.. నాన్న బాగుంది ఉంటే అమ్మ నేను వేరే లెవెల్ లో ఉండేవారని నాన్న చనిపోయారని తెలిసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యానని తెలిపింది జబర్దస్త్ పవిత్ర. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.