తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరుపొందింది హీరోయిన్ పూజ హెగ్డే. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరిని చెప్పవచ్చు. తెలుగు, తమిళ్ ,హిందీ వంటి భాషలలో నటిస్తూ దూసుకుపోతోంది. మొదట ఒక లైలా కోసం అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ కు మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలా ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ ,అల్లు అర్జున్ తదితరు హీరోల సినిమాలలో నటించింది.
పూజా హెగ్డే నటించిన రెండు సినిమాలు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి చేసింది. అందులో ఒకటి అరవింద సమేత మరొకటి అలా వైకుంఠపురం ఈ రెండు సినిమాలు విజయం తర్వాత మూడవసారి మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాలో నటించబోతోంది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొదట పూజా హెగ్డే ఆ తర్వాత శ్రీ లీల నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరు హీరోయిన్ల విషయంలో పూజ హెగ్డే కాస్త అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంలో కాస్త అలిగిందని వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. తనతో పాటు మరొక హీరోయిన్ కు సమానమైన స్థానం కల్పించడంతో పూజ హెగ్డే త్రివిక్రమ్ పైన అలిగినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పూజ హెగ్డే దాదాపుగా డేంజర్ జోన్ లో ఉందని చెప్పవచ్చు. ఇలాంటి సమయంలో మహేష్ త్రివిక్రమ్ సినిమా పైనే ఆశలు పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ .ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయిందంటే ఆ క్రెడిట్ అంతా శ్రిలీల కే వెళ్ళిపోతుందని ఆమె తెగ ఫీల్ అవుతున్నట్లు సమాచారం.