హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. శర్వానంద్ హీరోగా నటించిన మహాసముద్రం సినిమాలో సిద్ధార్థ్, అదితి జంటగా నటించారు. అయితే ఈ సినిమా సమయంలో ఏర్పడిన స్నేహం కారణంగా వీరిద్దరూ ఆ స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్నారని వార్తలు వినిపిస్తూ ఉండేవీ. ఇక త్వరలోనే వీరు వివాహం చేసుకోవడం ఖాయం అనే వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి.
సిద్ధార్థ్, అదితి జంటగా చట్టపట్టలేసుకుని తిరుగుతూ ఎన్నోసార్లు మీడియాకు కూడా చిక్కడం జరిగింది. రీసెంట్గా శర్వానంద్ ఎంగేజ్మెంట్ కు కలిసి రావడం నేటిజన్స్ ఆశ్చర్యాన్ని గురి చేసింది. ఇక ఇంతవరకు ఈ వార్తలకు ప్రాణం పోశాయని చెప్పవచ్చు.వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ కూడా న్యూస్ మరింత వైరల్ గా మారేలా చేసింది. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా అదితి సడన్గా సిద్ధార్థ్ కి ఒక షాక్ ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి రోజున వాలెంటైన్స్ డే సందర్భంగా.. అదితి ,సిద్ధార్థ్ కు కాకుండా మరొక హీరోకు లవ్ ప్రపోజ్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ లో సీనియర్ హీరో ధర్మేంద్ర కి అదితి వాలంటైన్స్ డే విషెస్ ను తెలియజేసిందట .అంతేకాకుండా ది మోస్ట్ హ్యాండ్సమ్ అంటూ కూడా తెలియజేసిందని సమాచారం.ఆయనకు రోజ్ ఫ్లవర్ ని ఇస్తూ దిగిన కొన్ని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ చేసిన పనికి ఒకసారిగా నేటిజెన్లు షాక్ అవుతున్నారు. ఇకపోతే అదితి షేర్ చేసిన పోస్టులకు సిద్ధార్థ రెండు లవ్ ఎమోజిలను పంపించడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.