టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడినట్లుగా గత ఏడాది తెలియజేసింది. ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూ తమిళనాడులోని పళని మురుగన్ ఆలయానికి వెళ్ళింది. సల్వార్ కమీజ్ ధరించిన సమంత ఆలయంలో 600 మెట్లు ఎక్కి వెళ్ళింది ప్రతి మెట్టుకు కూడా ఒక హారతి కర్పూరం వెలిగించుకుంటూ మరి స్వామివారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. అలా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నట్లు కనిపిస్తోంది సమంత.
ఇక సమంత వెంట దర్శకుడు ప్రేమ్ కుమార్ తో పాటు కొంతమంది సినీ నటులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సమంత మయోసైటిస్ వ్యాధి సోకినట్లు గత ఏడాది తెలియజేసింది. చికిత్సలోని భాగం గానే ప్రతి నెల ఇంట్రా విషసన్ ఇమ్యునోగ్లోబుల్ థెరపీ సెక్షన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమస్య నుంచి పూర్తిగా బయటపడే స్థితిలో ఉన్నట్లుగా తెలియజేసింది ఒకవైపు చికిత్స తీసుకుంటూనే మరొకవైపు మానసిక ప్రశాంతత కోసం ఇలా ఆలయాలని సందర్శించుకుంటూ వస్తోంది సమంత. ఇక ఏప్రిల్ 14వ తేదీన సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది.
ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన శాకుంతల సినిమా వాస్తవానికి ఫిబ్రవరి 17వ తేదీన విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల చేత పోస్ట్ ఫోన్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ సినిమా రెండుసార్లు వాయిదా పడింది.. ఇక గతంలో 3d పనుల కారణాల చేత ఈ సినిమా వాయిదా వేయవలసి వచ్చిందని డైరెక్టర్ తెలియజేయడం జరిగింది. ఇక ఈ చిత్రంలోని నటుడు దేవ్ మోహన్ , ప్రకాష్ రాజ్ తదితర నటీనటులు సైతం కీలకపాత్రలో నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.
எல்லாம் சரி ஆகனும் முருகா ! பழனி கோயிலில் சமந்தாhttps://t.co/wupaoCzH82 | #SamanthaRuthPrabhu #Samantha #PalaniMuruganTemple #palanitemple #Murugantemple #abpnadu @Samanthaprabhu2 pic.twitter.com/xKGii1sPr6
— ABP Nadu (@abpnadu) February 14, 2023