జెడి చక్రవర్తి ఒక అబద్ధాల కోరు.. సంచలన కామెంట్లు చేసిన స్టార్ హీరోయిన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటిగా తనకంటూ పేరు సంపాదించుకున్న సీనియర్ నటి రంభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరు సరసన నటించి అంతకుమించి అద్భుతమైన హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. తెలుగులో ఈమె జెడి చక్రవర్తితో కలిసి బొంబాయి ప్రియుడు సినిమాలో నటించినా.. ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ రేంజ్ లో సక్సెస్ పొందింది. ఇకపోతే రంభ వివాహం జరిగిన తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన విషయం తెలిసిందే.

అయితే ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని నటుడు జేడీ చక్రవర్తి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.. ఈ సందర్భంగా రంభ మాట్లాడుతూ..” ఇండస్ట్రీలో నాకు చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నారు అలాంటివారిలో జెడి చక్రవర్తి కూడా ఒకరు. ఆయన నాకు చాలా మంచి స్నేహితుడు.. అయితే నా పెళ్ళికి జేడీ చక్రవర్తిని ఆహ్వానించినా.. ఆయన మాత్రం నా పెళ్ళికి రాలేదు. ఆ విషయంలో చాలా బాధపడి అప్సెట్ కూడా అయ్యాను అంటూ తెలిపింది.

జెడి చక్రవర్తి ఫ్రెండ్షిప్ మైంటైన్ చేసే విషయంలో చాలా అబద్దాలు చెబుతాడు.. తాను ఒక పెద్ద అబద్దాలకోరు అంటూ ఆయన గురించి రంభ చేసిన ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రంభ తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఆమెకు అవకాశాలు రావడం లేదు. ఇకపోతే ఒకానొక సమయంలో ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాలలో కూడా స్పెషల్ సాంగ్స్ చేసి ప్రేక్షకులను అలరించింది.

Share.