బిగ్ బాస్ లోకి అనసూయ..!!

Google+ Pinterest LinkedIn Tumblr +
తెలుగు యాంకర్లలో క్రేజ్ ఉన్న యాంకర్లలో  అనసూయ కూడ  ఒకరు.ఈమె జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులలో ఇమేజను సంపాదించుకుంది. అంతేకాకుండా ఈమధ్య సినిమాలలో కూడా నటిస్తోంది.ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 కి కంటెస్టెంట్ విషయంలో కొన్ని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో అనసూయ పేరు కూడా వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో అనసూయ యాంకర్ గా అలాగే నటిగా చాలా బిజీగా తన లైఫ్ని గడిపేస్తోంది. అందుకనే ఈ టైంలో బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లేందుకు ఓకే చెప్పినట్టుగా సమాచారం అందుతోంది.
Bigg Boss Non-Stop: Episode 91: Anasuya Teases the Housemates
ఇక బిగ్ బాస్ కైతే ఓకే చెప్పింది కానీ రెమ్యూనేషన్ విషయంలో మాత్రం తగ్గేదే లేదు అన్నట్టుగా డిమాండ్ చేస్తోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ అమ్మడు ఇక స్టార్ మా వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం వారానికి రూ .7. 50 నుండిరూ .8.50 లక్షల రూపాయలను ఆమె డిమాండ్ చేసిందని  సమాచారం.అనసూయ కి ఉన్న క్రేజ్ కి ఫైనల్ వరకు బిగ్ బాస్ లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు కోటికి పైగా రెమ్యూనరేషన్ దక్కుతుంది. అంటే ఏకంగా కోటిన్నర రూపాయలు ఆమెకు రెమ్యూనరేషన్ గా దక్కే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఇంతవరకు ఈ వార్త బయటికి రాలేదు.. అంటే అనసూయ బిగ్ బాస్ కి వెళ్తుందా అన్న విషయం ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ అనసూయ వెళితే మాత్రము ఆమె కోసమైనా ప్రేక్షకులు ఆ షోని చూసే అవకాశం ఉంది. అందుకనే బిగ్ బాస్ వారు ఆమెను ఎంపిక చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెకు ఇచ్చే రెమ్యూనేషన్ ఎక్కువైనా పర్వాలేదు ఆమెని తీసుకొస్తే బాగుంటుందని ఆమె అభిమానులు కూడ అనసూయ బిగ్ బాస్ లోకి రావాలని కోరుకుంటున్నారు. మరి అసలు విషయం ఏంటన్నది అనసూయ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.
Share.