సినీ కెరీర్లో చాలామంది కొరియోగ్రాఫర్స్ ఉంటారు. ఎవరికున్న క్రేజ్ వాళ్లకి ఉంటుందనీ చెప్పవచ్చు. అందులో శివ శంకర్ మాస్టర్ కూడ ఒకరు. తన సినీ కెరీర్లో 800 కు పైగా పాటలకు కొరియోగ్రాఫర్ గా పని చేశారు. అంతేకాకుండా జడ్జిగా కూడా కొన్ని షోలకు వ్యవహరించారు. తెలుగు ,తమిళంలో పాటు పదికి పైగా భాషలలో శివశంకర్ మాస్టర్ పనిచేశారంటే ఆయన ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అంతేకాకుండా శివశంకర్ మాస్టర్ ఒకవైపు కొరియోగ్రాఫర్ గా మరోవైపు జడ్జిగా మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్ గా పలు క్యారెక్టర్స్ లో కెరియర్ను కొనసాగించారు. తన సినీ కెరీర్లో ఆయన ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకోవటం జరిగింది. ఇక శివశంకర్ మాస్టర్ వయస్సు 74 సంవత్సరాలు 2021 సంవత్సరంలో కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.ఆయన మరణించిన తర్వాత ఆయన ఫ్యాన్స్ ఎంతో బాధపడ్డారు.
చాలా సంవత్సరాల క్రితం ఒక ఇంటర్వ్యూలో తాను నగలు ధరించడం వెనక గల కారణాలను శివశంకర్ మాస్టర్ వెల్లడించారు. డాన్స్ మాస్టర్ అయిన నేను అమ్మాయిలాగా అందంగా రెడీ అయినట్టు మగవాళ్ళు ఎందుకు రెడీ కాకూడదని భావిస్తానని అందుకే నేను నగలు వేసుకున్నానని ఆయన తెలిపారు. అంతేకాకుండా నేను నేర్చుకున్నది క్లాసికల్ డాన్స్ నేను ఇలా ఉంటేనే పద్ధతిగా ఉంటానని అనిపించిందని ఆయన చెప్పారట. అప్పటి జనరేషన్ కు ఇప్పటి జనరేషన్ కు తేడా గురించి ఆయన మాట్లాడుతూ అప్పుడు వర్క్ కే ప్రాధాన్యత ఇచ్చారని ఇప్పుడు లైట్ యాక్టింగ్ కు ప్రాధాన్యత పెరిగిందని ఆయన కామెంట్స్ చేశారు. అంతేకాకుండా రాఘవేంద్రరావు గారు నేను నగలు వేసుకొని వెళ్లక పోతే నేను అలా చూడలేనని అన్నారట. ఈ సందర్భం గా శివశంకర్ మాస్టర్ చెప్పిన మాటలు వైరల్ గా మారుతున్నాయి.