హీరోయిన్ నయనతార, మాళవిక మోహన్ మధ్య గడిచిన కొద్దిరోజుల నుంచి కోల్డ్ వార్ జరుగుతూనే ఉన్నది.అందుకు కారణం లేకపోలేదు ఇటీవల మాళవిక మోహన్ సమయం దొరికినప్పుడల్లా పలు విమర్శలు చేస్తూనే ఉంది. నయనతార నటించిన నిర్మించిన కనెక్ట్ చిత్రం గురించి గత డిసెంబర్ 22న విడుదలైన సందర్భంగా ఆసుపత్రి బెడ్ పై పడుకున్న సన్నివేశంలో ఫుల్ మేకప్ తో జుట్టు కూడా చదరకుండా నటించినట్లు నటి నయనతార పేరు చెప్పకుండా మాళవిక మోహన్ విమర్శించడం జరిగింది.
ఇక ఈమెకు కౌంటర్ ఇచ్చే విధంగా కనెక్ట్ చిత్రం హార్ట్ ఫీలింగ్ కాదని కమర్షియల్ చిత్రమని అందుకే డైరెక్టర్ అశ్విన్ సూచన మేరకే తాను అలా నటించాను అనే విషయాన్ని నయనతార తెలిపింది. అయితే ఇప్పుడు తాజాగా మాళవిక మోహన్ మరొకసారి.. నయనతారను అవమానించే విధంగా పలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక విలేకర్ లేడీస్ సూపర్ స్టార్ నయనతార గురించి మీ అభిప్రాయం ఏంటనే ప్రశ్న వేయగా.. అందుకు మాళవిక మోహన్ తనని లేడీస్ సూపర్ స్టార్ అనడం తనకు నచ్చదని కూడా తెలియజేసింది.
హీరోయిన్లు సూపర్ స్టార్ అంటే చాలని లేడీ సూపర్ స్టార్ అనడం ఏంటని ప్రశ్నించింది.. హిందీలో కూడా దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, ఆలియా భట్ వంటి సూపర్ స్టార్ హీరోయిన్లు ఉన్నారని.. వారు ఎవరు లేడీస్ సూపర్ స్టార్ అని పిలవడం లేదని తెలియజేయడం జరిగింది. దీంతో నయనతారపై ఈ ఆమ్మడికి ఎందుకు అంత కోపం అంటూ సినీ ఇండస్ట్రీలో పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారుతోంది.