సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు వాళ్లకి ఒక మంచి గుర్తింపు రావాలని స్టార్ హీరోయిన్ అవ్వాలని కలలు కంటూ ఉంటారు. ఒక్కసారి స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చిందంటే చాలు ఎంతోమంది హీరోల పక్కన నటించే అవకాశం లభిస్తూ ఉంటుంది.. సినీ ఇండస్ట్రీలో టాలెంట్ కంటే ఎక్కువగా హిట్స్ కే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.అందుకే స్టార్ హీరోయిన్ అనే గుర్తింపు కోసం ఎంతోమంది పలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా స్టార్ హీరోయిన్గా వెండితెర మీద చాలా రోజులపాటు కొనసాగిన హీరోయిన్లలో రమ్యకృష్ణ కూడా ఒకరిని చెప్పవచ్చు.
కృష్ణవంశీ ఒకప్పుడు వరుసగా మంచి సినిమాలు తీసి ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా కూడా పేరు సంపాదించారు.నాగార్జునతో నిన్నే పెళ్ళాడుతా సినిమా తీసి మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు కృష్ణవంశీ. ఇక తర్వాత నాగార్జున తోనే చంద్రలేఖ అనే సినిమా తీసి ప్లాపులో ఉన్నప్పుడు.. నిన్నే పెళ్ళాడుతా సినిమా టీమ్ ని రిపీట్ చేద్దామని నాగార్జున చెప్పినప్పటికీ కృష్ణవంశీ మాత్రం ఒక హీరోయిన్ విషయంలో అయితే రమ్యకృష్ణ అని తీసుకుందామని చెప్పి ఆ సినిమాలో రమ్యకృష్ణనే తీసుకున్నారట.
అయితే కృష్ణవంశీ ఈ సినిమాకు ముందు నుంచి రమ్యకృష్ణ నీ ప్రేమిస్తున్నాడట. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆమెకు ప్రపోజ్ చేసినట్లుగా తెలిపారు. తన కొద్దిరోజులుగా ఈ విషయాన్ని హోల్డ్ లో పెట్టి ఆ తర్వాత నాకు ఇష్టమైన చెప్పడంతో ఇద్దరు కొద్దిరోజులు ప్రేమించుకొని ఆ తర్వాత వివాహం చేసుకున్నారట.వీరికి పెళ్లయిన తర్వాత కృష్ణవంశీ తను చేసిన శ్రీ ఆంజనేయం చిత్రంలో రమ్యకృష్ణ నితిన్ తల్లిగా చూపించారు. కానీ సక్సెస్ కాలేక పోయింది ఆ తర్వాత బాహుబలి సినిమాతో శివగామి పాత్రలో సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొట్టేసింది రమ్యకృష్ణ.