అల్లు రామలింగయ్య మనవడిగా మెగాస్టార్ కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ అయిన నటులలో అల్లు అర్జున్ కూడా ఒకరు. అల్లు అర్జున్ హీరోగా గంగోత్రి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా కంటే ముందు విజేత, డాడీ సినిమాలో కూడా అల్లు అర్జున్ కనిపించారు. కానీ హీరోగా మాత్రం గంగోత్రి సినిమాతోనే ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమాని డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు తెరకెక్కించారు.
అల్లు అర్జున్ రెండో చిత్రం ఆర్య మంచి కమర్షియల్ విజయాన్ని తెచ్చిపెట్టింది ఆర్య సినిమా తర్వాత అల్లు అర్జున్ గా మారిపోయారు. ఈ సినిమా కూడా బన్నీ కోటి రూపాయల లోపు రెమ్యూనికేషన్ తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత హ్యాపీ సినిమా చేయడం జరిగింది ఈ చిత్రానికి కూడా లక్షలలోనే తీసుకున్నారు.ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. 2007లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో దానయ్య నిర్మించిన దేశముదురు చిత్రానికి గాను అల్లు అర్జున్ కోటి రూపాయలకు మించి రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
మొదటిసారి అల్లు అర్జున్ దేశముదురు చిత్రానికి కోటి రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకొని హీరోగా నిలిచారు. ఈ చిత్రం మంచి విజయం కావడంతో ఇక ఆ వెంటనే పరుగు సినిమాతో రూ .5 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం పుష్ప చిత్రానికి రూ.70 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మెగా హీరో ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడు అయినప్పటికీ సొంతంగా తనకు ఒక ఇమేజ్ ని ఏర్పరచుకున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు.