సినీ ఇండస్ట్రీలో ఎవరి టైం ఎలా ఉంటుందో ఎవరమో చెప్పలేము. ఈ నేపథ్యంలోనే కండక్టర్ ని దిగ్గజ దర్శకుని దృష్టిలో పడేలా చేసింది అలా శివాజీ అనే ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని సూపర్ స్టార్ రజనీకాంత్ గా చేసింది సినీ పరిశ్రమ. అలా రజనీకాంత్ నటించిన సినిమాలు ఎలాంటి అద్భుతాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక రజనీకాంత్ నటించిన భాషా సినిమా అప్పట్లో ఎలాంటి అద్భుతాలు సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు.భాషా సినిమా రజినీకాంత్ నటించిన సినిమాలు అన్నిటిలో కూడా మర్చిపోలేని సినిమా అని చెప్పవచ్చు.
అప్పట్లో ఈ సినిమా కలెక్షన్లు సైతం సరికొత్త రికార్డులను సృష్టించింది.. ఈ సినిమా అనంతరం తెలుగులో డబ్ చేయడం జరిగింది. సురేష్ కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.ముందుగా ఈ సినిమాను తమిళంలో మాత్రమే విడుదల చేయాలనుకున్నారు కానీ తెలుగులో మాత్రం ఈ సినిమాని రిమూవ్ చేయాలని భావించారు. అందుకుగాను ఈ సినిమా నిర్మాతలు హైదరాబాదులో హీరోల కోసం ఒక స్పెషల్ ఈవెంట్ కూడా అప్పట్లో నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని చిరంజీవి లేదా బాలకృష్ణతో రీమిక్స్ చేయాలని డైరెక్టర్ సురేష్ కృష్ణ భావించారట.
ఈ చిత్రం బాలకృష్ణ కైతే కరెక్టుగా సెట్ అవుతుందని భావించారట .ఈ సినిమా డైరెక్టర్ సురేష్ ఈమె నేపద్యంలో సురేష్ కృష్ణ ఎన్నో సార్లు బాలకృష్ణను సంప్రదించి ఈ విషయాన్ని చెప్పడం జరిగిందట.ఆ సమయంలో బాలకృష్ణకు రీమేక్ సినిమాలు అంటే అంతగా నచ్చేవి కాదట.. ఎప్పుడు కూడా ఒరిజినల్ కథతోనే సినిమాని తీస్తానని చెప్పేవారట.అందుకే భాషా సినిమా రీమిక్స్ చేయడానికి బాలకృష్ణ ఒప్పుకోలేదు. దీంతో వేరే ఆప్షన్ లేక ఈ సినిమాని రజినీకాంత్ తోనే డబ్ చేసి విడుదల చేశారు. దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అప్పట్లోనే బాలకృష్ణ అభిమానులు ఈ సినిమాని వదులుకోవడంతో కాస్త నిరుత్సాహపడ్డారు.