మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాని విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం భోళాశంకర్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా తమన్నా.. కీర్తి సురేష్ చెల్లెలు పాత్రలో నటించబోతున్నారు. కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇటీవల ఆయన సింగర్ స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నిజం విత్ స్మిత అనే టాక్ షోలో పాల్గొనడం జరిగింది. ఇది ఓటిటి వేదికగా స్ట్రిమ్మింగ్ అవడం జరుగుతోంది.
ఈ షోలో చిరంజీవి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక విషయాలను కూడా పంచుకోవడం జరిగింది. ఫిబ్రవరి 10వ తేదీన చిరంజీవి ఎపిసోడ్ స్ట్రిమ్మింగ్ అవ్వడం జరిగింది.ఆయన జీవితంలో ఎదురైన కొన్ని చేదు సంఘటనల గురించి కూడా తెలియజేశారు. అలాగే తన సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన హీరోయిన్స్ గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. చిరంజీవి, రాధా, విజయశాంతి, రాధిక, శ్రీదేవి ,మాధవి వంటి అగ్ర హీరోయిన్ల సరసన నటించారు. అప్పట్లో చిరంజీవితో కలిసి ఎక్కువగా స్క్రీన్ షేర్ చేసుకున్న వారి గురించి స్మిత ప్రశ్నించడం జరిగింది.
రాధిక శరత్ కుమార్, రాధా ,విజయశాంతి, శ్రీదేవి వంటి స్టార్లలో ఎవరు బెస్ట్ అంటే చెప్పడానికి చిరంజీవి నిరాకరించారు. అందరితోనూ తనకు మంచి రిలేషన్ ఉందని మా మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ వర్కౌట్ అయిందని తెలిపారు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేకతలు ఉన్నాయని తెలిపారు. ఇక రాధిక సహజంగానే నటిస్తోందని అలాగే తనతో డాన్స్ చేసే విషయంలో రాధా ఫర్ఫెక్ట్ అని తన పాత్రలో తనను తాను మార్చుకొని గొప్పతనం విజయశాంతికి సొంతమని ఇక శ్రీదేవి గొప్ప వ్యక్తిత్వం వృద్ధిపరమైన రిలేషన్ పంచుకున్నానని తెలిపారు. అందుకే ఆమె ఎప్పుడూ తన ఫేవరెట్ హీరోయిన్ అని తెలిపారు.