ఈటీవీలో ప్రచారమవుతున్న జబర్దస్త్ షో ఏ రేంజ్ లో సక్సెస్ లను సాధించిందో అందరికి బాగా తెలుసు ఇంకా చెప్పాలంటే ఈ షోకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ముఖ్యంగా సుధీర్ టీమ్ ,ఆది టీమ్ పోట పోటీగా స్కిట్లను చేసేవారు. సుధీర్ టీమ్ కి రాంప్రసాద్ పాత్ర కూడా కొంతమేర ఉందనే సంగతి తెలిసిందే..గెటప్ శ్రీను వేసే రకరకాల గెటప్పులకు ఫిదా అయిపోవాల్సిందే ఇక రాంప్రసాద్ వేసే ఆటో పంచులకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు తన ఆటో పంచులు నచ్చే విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.
అయితే ఒక వార్త రామ్ ప్రసాద్ దృష్టికి వెళ్లిందట. అదేమిటంటే రామ్ ప్రసాద్ కి క్యాన్సర్ అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ మాటలకు స్పందించిన రాంప్రసాద్ నాకు క్యాన్సర్ అని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆయన చెప్పుకొచ్చారు. నేను తలకు క్యాప్ పెట్టుకున్నానని ఆ క్యాప్ వల్ల ఈ ప్రచారం జరిగిందని ఆయన అన్నారు. నాకు ఏం జరగలేదని కేవలం హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నానని ఆయన మాటల్లో చెప్పారు. రామ్ ప్రసాద్ చెప్పిన మాటతో నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్లు ఇకనైనా చెయ్యకుండా ఆగుతారేమో చూడాలి.
సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ వీరి ముగ్గురు ఎంతో స్నేహంగా ఉంటారు. అలాగే వీరందరూ మళ్ళీ కలిసి జబర్దస్త్ లోషో చేస్తే బాగుంటుందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్లో స్కిట్లు వస్తాయేమో చూడాలి మరి.. గతంతో పోల్చి చూస్తే జబర్దస్త్ కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ రేటింగులు బాగా తగ్గిపోయాయి. అంతేకాకుండా రాను రాను జబర్దస్త్ నుంచి సీనియర్ కమెడియన్స్ వెళ్లిపోవడం వల్ల రేటింగ్ దారుణంగా ఉంది.