తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా సురేష్ బాబు, హీరోగా దగ్గుబాటి రానా చాలా బిజీగా ఉన్నారు.ఈ మధ్యకాలంలో రానా పెద్దగా సినిమాలలో నటించకపోయిన పలు విషయాలలో వైరల్ గా మారుతున్నారు. ఇక దగ్గుబాటి ఫ్యామిలీ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటోంది. తాజాగా సురేష్ బాబు, రానా ఒక వివాదంలో చిక్కుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫిలింనగర్ ల్యాండ్ వివాదంలో కొత్త మలుపు తిరిగినట్లుగా తెలుస్తోంది. సురేష్ బాబు రానా మీద క్రిమినల్ కేసు నమోదైనట్లుగా సమాచారం.
దౌర్జన్యంగా తమ భూములను రౌడీల సహాయంతో కాళీ చేయించారని ప్రమోద్ కుమార్ అనే వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఖాళీ చేయకపోతే తమ అంతు చూస్తామని సురేష్ బాబు బెదిరించాలని ఆ ఫిర్యాదులో తెలియజేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే బంజారా హిల్స్ పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు బాధితుడు.. దీంతో సురేష్ బాబు, దగ్గుబాటి రానా తో సహా మరి కొంతమంది విచారణకు రావాలని సామాన్లను జారీ చేయడం జరిగింది న్యాయస్థానం.
ఈ వ్యవహారంపై గతంలో కొన్ని వార్తలు వినిపించాయి తాజాగా కోర్టు జోక్యం చేసుకోవడంతో ఇప్పుడు ఇదే వార్త ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారుతోంది. మరి ఈ విషయంపై దగ్గుబాటి ఫ్యామిలీ ఎలా స్పందిస్తారో చూడాలి మరి. నెట్ ఫ్లిక్స్ లో రామానాయుడు అనే వెబ్ సిరీస్ లో వెంకటేష్ రానా నటిస్తూ ఉన్నారు. మరి ఏడదైనా రానా పలు చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకుంటారేమో చూడాలి మరి. ఇక సురేష్ బాబు మాత్రం మంచి కథలను ఎంచుకుంటూ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.