తెలుగు సినీ ఇండస్ట్రీలో యాపిల్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ హన్సిక. తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన స్టార్ హీరోయిన్గా మాత్రం పేరును సంపాదించు కోలేకపోయింది. తమిళంలో మాత్రం ఈ ముద్దుగుమ్మ అంచనాలను మించి సక్సెస్ అయిందని చెప్పవచ్చు.. అయితే కొన్ని నెలల క్రితం హన్సిక వివాహం తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ పార్ట్నర్ తో వివాహం జరిగింది. అయితే ఈమె పెళ్లి గురించి సోషల్ మీడియాలో పలు భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. వాటి గురించి తాజాగా హన్సిక స్పందించడం జరిగింది వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హన్సిక భర్త మొదటి పెళ్లి సమయంలో హన్సిక డాన్స్ చేసిన వీడియోలను సైతం నెట్టింట వైరల్ గా చేశారు. హన్సిక తన స్నేహితురాలికి అన్యాయం చేసిందని ఆమె వల్లే స్నేహితురాలు, సోహైల్ విడిపోయారని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.. తాజాగా ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించి స్పష్టత ఇచ్చినట్లుగా తెలుస్తోంది.. తన భర్త విడాకులకు తాను కారణం కాదని హన్సిక తెలియజేస్తూ.. నా పెళ్ళికి సంబంధించిన విషయాలను సీక్రెట్ గా ఉంచాలనుకున్నాను అయితే నాకు సంబంధం లేకుండానే తన పెళ్లి వార్తలు బయటకు వచ్చాయని తెలియజేసింది.
అలా వార్తలు ప్రచారంలోకి రావడం తనకు ఇష్టం లేదని కూడా తెలిపింది హన్సిక. నేను సెలబ్రిటీ కావడం వల్ల ఇలా జరిగిందని తెలిపింది.. సోహైల్ గురించి రాసిన వార్తలలో చాలా ఒత్తిడికి గురయ్యాను ఆ తర్వాత ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేయడం జరిగిందని చెప్పింది హన్సిక. సోహైల్ గతం గురించి నాకు తెలుసు అని అతడు విడాకులతో నాకు ఏమాత్రం సంబంధం లేదని తెలిపింది.. హన్సిక లవ్ షాది డ్రామా పేరుతో ఒక వీడియోని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం చేస్తున్నారు.