ఖడ్గం సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు నటుడు సుబ్బరాజు.. ఇలా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అయ్యారు సుబ్బరాజు.. ఈ నటుడు ఆ తర్వాత అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, దేశముదురు తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుబ్బరాజు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తాను ఇండస్ట్రీకి వచ్చిన 20 సంవత్సరాలు సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను సైతం వెల్లడించారు.
సుబ్బరాజు మాట్లాడుతూ..ఇంత ఫిట్నెస్ గా ఉండడానికి ముఖ్య కారణం వ్యాయామం అంటూ తెలిపారు. ఇలా ఫిట్నెస్ కాపాడుకుంటూనే మంచి పాత్రలు చేయగలిగానని లేకపోతే తండ్రి పాత్రలు చేయవలసి వచ్చేది అంటూ తెలిపారు. తన కెరీర్ గురించి మాట్లాడుతూ వ్యక్తిగత విషయాల గురించి తెలియజేయడం జరిగింది. తన తండ్రి భీమవరం డిఎన్ఏ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసేవారని తెలిపారు. చిన్నప్పుడు తాను సైకిల్ స్పీడుగా తొక్కిన ఎందుకు అంత స్పీడుగా తొక్కుతున్నావని ప్రశ్నించే వారిని తెలిపారు. అంతేకాకుండా తనకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అని అడిగే వారిని తెలిపారు.
తనకు స్నేహితులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారని అలాంటిది గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వస్తారని తెలిపారు. అయితే సుబ్బరాజు ఇప్పటివరకు వివాహం చేసుకోకపోవడానికి గల కారణం తెలియజేశారు.. తనకు పెళ్లి చేసుకోవలసిన అవసరం లేదని అందుకే తాను పెళ్లి చేసుకోకుండా ఉన్నానని తెలిపారు. సినిమాలలో మంచి పాత్రలు కావాలని డైరెక్టర్లను అడగాలని అనిపించదని అలా అడగడం తనకు మొహమాటంగా అనిపిస్తుందని తెలిపారు.. తన కెరియర్లో డ్రగ్స్ కేసులో ఈయన పలుమార్లు విచారణకు హాజరయ్యారు అయితే ఇలా డ్రగ్స్ కేసు గురించి మాట్లాడుతూ ట్రక్స్ కేసులు చిక్కుకున్నప్పుడు తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని తన ఇమేజ్ కూడా డామేజ్ అయ్యిందని తన పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారని ఆ బాధ తనకు ఎక్కువగా ఉందని తెలిపారు.