టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటీసిస్ వ్యాధితో బాధపడుతోంది. కొంతకాలంగా ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూ ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. అయితే సమంత ఈ వ్యాధి గురించి చెప్పగానే చాలామంది హీరోయిన్లు మేము కూడా కొన్ని ఇబ్బందులతో బాధపడుతున్నామని తెలియజేయడం జరిగింది.ఇకపోతే తాజాగా హీరోయిన్ రష్మిక మందన సైతం ఇలాంటి చర్మవ్యాధితో బాధపడుతోందని ఈమె చేసినటువంటి పోస్ట్ ద్వారా అనుమానాలకు కారణం అవుతున్నాయి.
అంతేకాకుండా అంతకుముందే నటి మమతా మోహన్ దాస్ , పూనమ్ కౌర్, కల్పికగణేషన్ వంటి తదితరులు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఇక ఇప్పుడు రష్మిక సోషల్ మీడియా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది కొన్నిసార్లు తన డైరీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఈమె తన దినచర్యకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో భాగంగా డియర్ డైరీ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ గా గడిచింది. లేవగానే కార్డియో వర్కౌట్ చేశా.. ఆ తరువాత ఆహారం తీసుకున్న రేపటి షెడ్యూల్ కోసం లగేజ్ సర్దుకున్నా.. నా చుట్టూ వాతావరణం మంచు నన్ను బయటకు వెళ్లకుండా డ్రామాలు చేశాయి. ఇక సర్దడం అయిపోయాక మళ్ళీ వర్కౌట్ చేశా ఆ తర్వాత డిన్నర్ చేస్తా..
ఆ తరువాత డెర్మటాలజీ అపాయింట్మెంట్ తీసుకున్నా అలాగే ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే అది క్యాన్సల్ చేశా మీటింగ్ క్యాన్సల్ అవ్వటంతో తిరిగి ఇంటికి వచ్చేసా.. గుడ్ నైట్ బాగా పడుకో అంటూ లవ్ సింబల్ షేర్ చేశా ఇలా ఈమె తన డైరీలో డర్మాట్ అపాయింట్మెంట్ అని రాయడంతో… అభిమానులకు సైతం అనుమానం పెట్టించాలా చేసింది.దీంతో రష్మిక కి ఏమైనా చర్మ సమస్యలు ఉన్నాయా అందుకే డాక్టర్ని కలవటం కోసం అపాయింట్మెంట్ తీసుకున్నారా అంటూ పలువురు అభిమానులు , నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే రష్మిక ఏ సమస్యతో బాధపడుతోందన్న విషయం తెలియటం లేదు. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది రష్మిక