అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితురాలే. ఇక ఇమే కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాలలో నటిస్తోంది. టాలీవుడ్ లోకి మాత్రం ఇప్పటివరకు ఎంట్రీ ఇవ్వలేదు కానీ అభిమానులు మాత్రం ఎంట్రీ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే తనపై వచ్చిన ట్రోల్స్ గురించి కాస్త ఘాటు గానే స్పందించింది జాన్వీ కపూర్. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ట్రోల్స్ వల్ల తను చాలా బాధపడ్డానని తెలియజేస్తోంది. జాన్వీ కపూర్. నెపో కిడ్ అంటూ చేసిన వ్యాఖ్యలతో చాలా బాధపడ్డారని తెలుపుతోంది. మనం సక్సెస్ సాధించడానికి ఎంతగానో కష్టపడిన కొందరు మాత్రం మనలోనే తప్పులను వెతకడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారని తెలుపుతోంది. ఆ విధంగా వాళ్ళు ఆనందం పొందుతున్నారని జాన్వీ కపూర్ తెలుపుతోంది.. వాళ్ల వ్యాఖ్యల వల్ల మనం న్యూస్ లో నిలుస్తున్నామని ఇది నిరంతరం సాగే ఒక ప్రక్రియ అంటూ తెలియజేస్తోంది జాన్వీ కపూర్.
దురదృష్టం కొద్దీ రోజులు అయినా తర్వాత ఈ వార్తలు చదివి విసిగిపోతారని తెలుపుతోంది .కెరీర్ మొదటిలో తనపైన నెపో కిడ్ అనే విమర్శలు ఎక్కువగా వినిపించాయని.. కొంతమంది తమ సినిమాలలో ఎందుకు నటిస్తున్నావని కామెంట్లు కూడా చేశారని శ్రీదేవి కూతురు అయితే నటించాలా అంటూ కూడా కామెంట్స్ చేశారట. దీంతో ఇలా ఎన్నో ట్రోల్స్ తో చాలా ఇబ్బంది పడ్డారని ఇప్పుడు మాత్రం ట్రోల్ చూసి నవ్వుకుంటున్నారని తెలియజేస్తోంది. నా బలాలు బలహీనతలు నాకు తెలుసు ప్రస్తుతం ట్రోల్స్ ను చూసి నవ్వుకుంటున్నామని తెలియజేస్తోంది.