టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో సమంత కూడా ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. ఎంతో ఇష్టంగా నాగచైతన్య ప్రేమించి మరి వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ కొన్ని కారణాల చేత విడిపోవడం జరిగింది. కానీ వీరిద్దరి విడిపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయం ఇప్పటికీ అభిమానులకు అంతు చిక్కడం లేదు. దీంతో సమంత చాలా డిప్రెషన్ లోకి గురై తిరిగి మళ్లీ సినిమాలలో బిజీగా ఉంటున్న సమయంలోనే ఈమె మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడ్డట్టుగా తెలియజేసింది.
దీంతో సమంత ఈ మధ్యకాలంలో నెమ్మదిగా ఈ వ్యాధి నుంచి బయటపడుతోంది. ఇక ఇలా బయటపడడానికి సమంత ఎన్నో రకాలుగా పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగానే జిమ్ములో ఎప్పుడు వర్కౌట్లు చేస్తూ కనిపిస్తూ ఉంటుంది.తాజాగా సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. అందులో సమంత పింకు కలర్ చిన్న షాట్ ధరించి.. విత్ బ్రాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సమంత అందంతో ఆకర్షణీయంగా కనిపిస్తోందని ఈ ఫోటోలను వీడియోను చూస్తే మనకి అర్థమవుతోంది.
ఈ స్టోరీని చూసిన అభిమానులు సైతం సమంత చేస్తున్న వర్కౌట్ లకు అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. మరి కొంతమంది నువ్వు అనారోగ్య సమస్యల నుంచి త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. జిమ్ వర్క్ అవుట్ లలో పలు రకాల బంగిమలు సమంత ఇలా వర్కౌట్ చేస్తూ ఉంటే పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సమంత తనకు ఎలాంటి విషయాన్నయినా సరే అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇటీవలే ఒక హాలీవుడ్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.