డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెరీర్ లో మహేష్ బాబు కెరియర్ లో ఒక మైలు రాయిగా నిలిచిపోయిన చిత్రం పోకిరి. ఈ చిత్రం వీరిద్దరి కెరీర్ కి ఎంతో బాగా ఉపయోగపడిందని చెప్పవచ్చు. మహేష్ బాబు మాస్ ఇమేజ్ కి మార్చడానికి ఈ సినిమా ఎంతో ఉపయోగపడింది. ఈ సినిమా దాదాపుగా అప్పట్లోనే రూ.50 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా క్లైమాక్స్ కొంచెం మార్చకపోతే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని ఈ సినిమా ఎడిటర్ అయిన మార్తాండ్ కే .వెంకటేష్ తెలియజేశారట.
దీంతో పూరి జగన్నాథ్ కొద్దిగా ఆలోచించి మహేష్ బాబు ఇందులో పోలీస్ అనే ట్విట్ ని రివిల్ చేయడం జరిగిందట. దీంతో ఈ సినిమాకు ముందుగా వేరే క్లైమాక్స్ అనుకున్నప్పటికీ మార్తాండ్.. చొప్పిన మార్పులని స్వీకరిస్తూ పూరి జగన్నాథ్ ఈ సినిమాలో కాస్త మార్చి చూపించడం జరిగిందట. దీంతో ఈ సినిమా అందరికీ నచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలాంటి క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఆప్పటివరకు ఏ చిత్రానికి కూడా చూడని విధంగా సరికొత్త డిజైన్ తో చేశారు పూరి జగన్నాద్.
ఇక ఈ చిత్రంతో ఎన్నో సినిమాలు ఇలాంటి బేస్ చేసుకుని విడుదలయ్యాయి. ఇప్పటికీ కూడా ఇలాగే వస్తూ ఉన్నాయి సినిమాలు. అయితే ఇంతటి మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం మరొకటి లేదని కూడా చెప్పవచ్చు ప్రస్తుతం పూరి జగన్నాథ్ స్టోరీలు రాసేపనిలో బిజీగా ఉన్నారు మహేష్ మాత్రం వరుస సినిమాలతో సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో తిరిగి సినిమా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.